
పల్లె దవాఖాన భవనాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఏప్రిల్ 21,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తిర్లాపురం గ్రామంలో సుమారు 16 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా ప్రారంభించారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్తీ దవాఖాన లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది అన్నారు, వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్నారు, ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ బస్తీ దవాఖానలకు కార్పొరేట్ ఆస్పత్రులుగా గా తీర్చిదిద్దు తున్నారన్నారు…