
పాఠాలు చెప్పే పంతులే మైనర్ బాలికల పై వేధింపులు
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెలుగులోకి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి. పాఠాలు చెబుతున్న వాడే కామాంధుడై వేధిస్తూ, వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న కీచకఉపాధ్యాయుడు, పాఠాలు చెబుతూ విద్యార్థినీలను తాకరాని చోటు తాకుతూ , అసభ్యకరమైన చేష్టలతో పదజాలాలతో విద్యార్థినీలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధ్యాపకుడు. గతంలో ఇంతకుముందు పనిచేసిన పాఠశాలలో కూడా ఇదే పనితీరుతో బాలికలను వేధించినట్లు సమాచారం. విద్యార్థినిలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎవరికైనా చెపితే మీ మార్కులను, తగ్గిస్తానని మిమ్మల్ని ఫెయిల్ చేస్తానని,భయాన్ని విద్యార్థినీలలో నింపి , నేను చెప్పినట్టుగా మీరు చేస్తే కొత్త బట్టలు, కొత్త బ్యాగులు, కొత్త బూట్లు కొనిస్తానని, మైనర బాలికలను ఆశ చూపిస్తూ, వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
గత ఆరు నెలలుగా తల్లిదండ్రులు గాని స్నేహితులు గాని చెప్పుకోలేని విధముగా ఉపాధ్యాయుడు విద్యార్థినిని భయపెట్టి బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం ముగ్గురు విద్యార్థినీలు బయటకు తీసుకుని రావడం విశేషం. ఆ విషయమై మండల విద్యాశాఖ అధికారి ఆ కీచక ఉపాధ్యాయుడిని సమర్థించటం విశేషం. ఈ విషయమై తల్లిదండ్రులు జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ విషయమై కుల సంఘాలు మరియు అఖిలపక్ష నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఆ ఉపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. స్కూల్ విద్యార్థిని విద్యార్థినిల తల్లిదండ్రులు తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల ఎం ఈ ఓ మరియు పోలీస్ వారిని కోరడమైనది.