
వైద్యుల నిర్లక్ష్యం వలనే ఒక నిండు ప్రాణం బలి అని నిరసన
“ములుగు జిల్లా సీకే ప్రతినిధి భార్గవ్ “
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్ర పరిధిలో బెస్తగూడెం గ్రామంలో విషాద గాధ నెలకొంది ఆదివారం కావడంతో ఆటపాటలతో అలసిపోయిన చిన్నారి స్నానం చేసి రెడీ అయ్యేందుకు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతుండగా టేబుల్ కింద మృత్యు రూపంలో పొంచి ఉన్న నాగుపాము పాప కాలు పై 3 సార్లు వరుస దాడులు చేయగా పాముని గమనించిన ఆ పాప తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అమ్మ పాము కరిచిందని గిల్లుమని మొత్తుతుంది
గాయపడిన పాప కాలు గాయాలను చూసిన తల్లిదండ్రులు వెంటనే వెంకటాపురం ప్రభుత్వ దౌఖానాకు తీసుకువెళ్లారు ఆదివారం కావడంతో డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల పాపకు దాదాపు 20 నిమిషాలు లేటుగా వైద్యం అందించారు
ఇది ఇలా ఉండగా పాము పాప కాలు పై వరస దాడులు చేయడంతో తీవ్ర రక్తస్రావాన్ని గమనించిన వైద్య సిబ్బంది ఇది పాము కాదు ఎలక గీకి ఉండొచ్చు లేదా కొరికి ఉండొచ్చు అని కాలం టీటీ ఇంజక్షన్ మరియు యాంటీబయాటిక్ అందించారు పాపకి జరిగిందొకటి వైద్యం అందింది మరొకటి క్షణం క్షణం పాప క్షీణించుట గమనించిన వెంకటాపురం వైద్య సిబ్బంది చేతులెత్తేశారు
మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం రిఫర్ చేశారు పాప ప్రాణాలను దక్కించుకునే క్రమంలో తల్లిదండ్రులు వైద్యులను అన్ని మెరుగైన వైద్యం లభిస్తుందని ప్రభుత్వ వాహనమైన అంబులెన్స్ లో ఎటునాగారం దవాఖానకు వెళ్తుండగా మార్గం మధ్యలో వాజేడు మండలం జగన్నాధపురం జంక్షన్ పరిధిలో పాప చనిపోయింది
విషయాన్ని గమనించిన అంబులెన్స్ వైద్య సిబ్బంది పాప నాడిని పరీక్షించగా పాప మృతి చెందినట్లు నిర్ధారించారు తల్లిదండ్రుల ఆవేదనను ఆపలేని అంబులెన్స్ వైద్య సిబ్బంది ఏటూరునాగారం ప్రభుత్వ దవఖానకు తీసుకువెళ్లారు
అప్పటికే పాపకు కాలం చెల్లిందని చెప్పడంతో ఏటూరునాగారం హాస్పిటల్ ఆవరణలో విషాదఛాయల్ నెలకొన్నాయి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే పాప దక్కలేదంటూ పాప మృతదేహాన్ని నేరుగా వెంకటాపురం అంబేద్కర్ సెంటర్ లో రాస్తారో నిరసనకు దిగారు బాధితులు
ఈ నిరసనలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులను ఫోన్ ద్వారా తెలుసుకున్న వెంకటాపురం పోలీస్ శాఖ సీఐ శివప్రసాద్ సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని పాప తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నిరసనను నిమ్మలించారు…