
ఎన్నికల హామీలు అమలు చేసి కెసిఆర్ తన చిత్తశుద్ధి నీ నిరూపించుకోవాలి
పాలకులను ప్రశ్నించేందుకు ప్రజా చైతన్య యాత్ర లు
ఏప్రిల్ 14 నుంచి , సిపిఐ ప్రజా చైతన్య యాత్ర లు: సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా
సి కె న్యూస్ ప్రతినిధి హాథిరామ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో జరిగిన సిపిఐ మండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారం చెల్లించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు
ఆదివారం సిపిఐ మండల కార్యవర్గ సమావేశం గుండె పిన్ని మధు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అకాలముగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న మిర్చి ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఒక్కో రైతు ఎకరంకు 40 వేల రూపాయలు పైగా పెట్టుబడి పెట్టిన నష్టపోయారని తక్షణమే ప్రభుత్వం స్పందించి జరిగిన నష్టం పై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి నష్టాన్ని అంచనా వేయించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ,
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వారిని మరింత ధనవంతులుగా మారుస్తున్నారని నిత్యవసర వస్తువులు కొనలేక అనేక అవస్థలు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లాలో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీరు అందించాలని సూచించారు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 2,99,748 ఎకరాలకు పోడుపట్టాలు తక్షణమే ఇవ్వాలని కోరారు
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు Aiyf జిల్లా కార్యదర్శి ఎస్కే నాగుల మీరా సిపిఐ మండల సహాయ కార్యదర్శులు గార్లపాటి వీరభద్రం sk చాంద్ పాషా ఎల్లంకి మధు చింత స్వరాజ్ రావు యాస రోశయ్య సిరిపురపు వెంకటేశ్వర్లు తూము కోటయ్య వల్లమల్ల సామేలు పొన్నెకంటి వెంకటేశ్వర్లు చిమట ముత్తయ్య పగడాల అఖిల్ గార్లపాటి శివకృష్ణ బడుగు వీరస్వామి కొండా వీరయ్య తదితరులు పాల్గొన్నారు