
పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ పరిధిలో మెగా హెల్త్ క్యాంప్.
సీ కే న్యూస్ ఎటపాక ప్రతినిధి.
ఏప్రిల్ 14,
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలం, పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మెగా హెల్త్ క్యాంపులో సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ , గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట రామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు
వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రజల కొరకు నిర్వహించే ఈ హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని, గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి, యోగ, మరియు వాకింగ్ వంటి ఫిజికల్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని చెప్పి తెలియజేసినారు.
ఈ హెల్త్ క్యాంపుకు పురుషోత్తపట్నం లోని గ్రామ ప్రజలు ఎక్కువమంది హాజరై బిపి టెస్టులు మరియు షుగర్ టెస్టులు చేయించుకొని వాటికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని వెళ్లడం జరిగింది. అంతేకాకుండా జలుబు, జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వంటి వాటి కూడా మందులు తీసుకొని వెళ్లడం జరిగింది. ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఇటువంటి మెగా హెల్త్ క్యాంపు ల వల్ల ప్రజలకు చాలా ఉపయోగమున్నట్లు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ, గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి , సిహెచ్ఓ లక్ష్మీ, మరియు మెడికల్ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.