PoliticsTelangana

పెండ పిసికి, దున్నపోతులు కాసే. తలసాని నా గురించి మాట్లాడుతున్నారు – రేవంత్‌

పెండ పిసికి, దున్నపోతులు కాసే. తలసాని నా గురించి మాట్లాడుతున్నారు - రేవంత్‌

కేసీఆర్ కాళ్లు పిసికినట్టు కాదు.. నన్ను పిసుకుడు: తలసానికి రేవంత్ రెడ్డి కౌంటర్!!

తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.
మొదటినుంచి దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఉందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు.


తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు చిన్నప్పటి నుంచి దున్నపోతులను కాయడం వల్ల,దున్నపోతులతో తిరగడం వల్ల, స్వయంగా ఆయనను ఆయన దున్నపోతుగా భావించడం వల్ల ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.


మంత్రి హోదాలో ఉండి,ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పాన్ పరాగ్ వంటి గుట్కాలు నములుతున్నారని, ఆ అలవాటు మానుకుంటే మంచిది అంటూ హితవు పలికారు.
ప్రజాప్రతినిధులుగా యువతకు ఆదర్శంగా ఉండాలని, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన అలవాట్లు మార్చుకుంటే మంచిదని సూచించారు.


అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్లాడే వాళ్ళేనా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రశ్నించారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే,ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని,అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని అన్నారు.


కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ముందు మంత్రిగా ఆయన బాధ్యత గుర్తెరగాలని, మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంక నాకినా ఈ స్థాయికి రాలేరని తేల్చిచెప్పారు.కాబట్టి ఆయన స్థాయి, హోదా, భాష అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని,లేదా ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కౌంటర్ వేశారు.తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected