పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మచ్చా
పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మచ్చా
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఫిబ్రవరి 28
అశ్వారావుపేట లోని స్థానిక రైతు వేదిక వద్ద మంగళవారం పెన్షనర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు సంగం వారు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఉద్యోగికి అలాగే రిటైర్డ్ ఐనా ఉద్యోగులకు అండగా ఉంటుందని, అలాగే మన మండలంలో గల రిటైర్డ్ ఉద్యోగులు వారికి వసతి భవనం కావాలని అడగగా ప్రభుత్వం తరపున మాట్లాడి నిధులు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని. అలాగే వసతి భవనం నిర్మాణం కొరకు 5 లక్షలు ఎమ్మెల్యే గ్రాంట్ నుండి మంజూరీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వం తరపున రిటైర్డ్ ఉద్యోగులు ఎటువంటి సహయం కావాలన్న తాను ముందుటనాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పేది తక్కువ చేసేది ఎక్కువా అనీ నియోజక అభివృద్ధి కొరకు మాటలలో చెప్పరని చేతలలో చేసి చూపిస్తారని, అలాగే ఈ రిటైర్డ్ ఉద్యోగులు అడగగానే వసతి భవనం నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ బి ఆర్ ఎస్ పార్టి కె ఓటు వేయాలని,మన నియోజకవర్గం లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇంకా ఉన్నత స్థానంలో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు జెడ్పీటీసీ చిన్నంశెట్టి. వరలక్ష్మి, మండల బి ఆర్ ఎస్ పార్టి అధ్యక్షులు బండి పుల్లారావు.మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి,గుడవర్తి వేంకటేశ్వర రావు, యు ఎస్ ప్రకాష్ రావు,అశ్వారావుపేట టౌన్ బి ఆర్ ఎస్ పార్టి ప్రెసిడెంట్ సత్యావరపు సంపూర్ణ, పెరయి గూడెం బి ఆర్ ఎస్ పార్టి ప్రెసిడెంట్ చిప్పనాపల్లి.బజరయ్య, కలపాల.శ్రీనివాస రావు, చిప్పనపల్లీ శ్రీను,సుదర్శన్ మొటూరి మోహన్,మండల రిటైర్డ్ ఉద్యోగులు సంగం ప్రెసిడెంట్ పున్నం.పుల్లారావు, జిల్లా రిటైర్డ్ ఉద్యోగులు సంగం ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.