పోడు భూములకు పట్టాల కోసం పోరు బాట చేదాం

పోడు భూములకు పట్టాల కోసం పోరు బాట చేదాం
ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి రైతు బంధు వర్తింప చేయాలి
గంగారాం మండల అధికారులను సన్మానించిన సీతక్క
ములుగు నియోజక వర్గం గంగారాం మండలం లోని బుర్కవాని గుంపు, కొడిషెల మిట్ట, పందెం గ్రామాలలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల సమయం లో ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి రైతు బంధు వర్తింప చేయాలని స్వయంగా ముఖ్య మంత్రి కెసిఆర్ అసెంబ్లీ లో నేను కుర్చీ వేసుకుని కూర్చొని పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తాని చెప్పి 10 కావస్తుంది మరి ముఖ్య మంత్రి కెసిఆర్ గారికి కుర్చీ దొరకడం లేదా ములుగు కు దారి దొరకడం లేదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటవీ హక్కుల చట్టం అమలు చేసి వేలాది ఎకరాలకు పట్టాలు ఇచ్చి పంట రుణాలు ఇచ్చి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలు ఇస్తాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం పేదోడి ఇంటి కల నెరవేర్చడం కోసం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం అని అదే విధంగా గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తాం అని అన్నారు
అనంతరం గంగారాం తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్,ఎంపిడిఓ,డాక్టర్
ఎంపిఓ లను శాలువా తో సన్మానించిన సీతక్క
మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
గంగారాం మండలం లోని బర్కా వాని గుంపు గ్రామానికి చెందిన తాటి కృష్ణ దనసరి లక్ష్మయ్య లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన సీతక్క
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లు పుల్సం పుష్ప లత శ్రీనివాస్ఈసం రమ సురేష్,ఎంపీపీ లు బానోత్ విజయ రూపు సింగ్సు వర్ణ పాక సారోజన జగ్గారావు,మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,జాడి వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ కడబోయిన జంపయ్యా, ఎంపీటీసీ బుర్కా పుష్ప లత నరేందర్,బిట్ల శ్రీనివాస్ మండల కో ఆప్షన్ సభ్యులు ఎండీ సయ్యద్,sk సయ్యద్మై నార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండీ అజ్మత్
సర్పంచ్ చుంచ వెంకట లక్ష్మీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈసం నర్సక్క,తదితరులు పాల్గొన్నారు