
పోరాటాలకే పరిమితమా పదవులు మాకు వర్తించవా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వేల్పుల నరసింహారావు
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు …
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జులూరుపాడు గ్రామస్తుడైన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, స్నేహశీలి, ప్రజా మనిషి, ఆపద్బాంధవుడుgv, బిఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల నరసింహారావు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినా ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం లో కెసిఆర్ నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ రూపకల్ప లో 2001 లో ఏర్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ వ్యవస్థాపక జిల్లా ప్రధాన కార్యదర్శిగా టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ జెండాను ఉమ్మడి ఖమ్మం జిల్లా కు తీసుకొచ్చిన పదిమంది సభ్యులలో నేను ఒకడిని ముఖ్యుడను ఆనాటి నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే అంతవరకు 2001 నుండి 2014 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాటి సుజాతనగర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగానికి పైగా మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని భావజాల వ్యాప్తి చేయటం, పల్లె బాట విద్యుత్ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎం కెసిఆర్ నాయకత్వంలో పార్టీ పిలుపు లో భాగంగా వివిధ మండలాల్లో నెలలు కొద్దీ ఇన్చార్జిగా నిర్వహించటం జరిగింది. ప్రత్యేక తెలంగాణ భావజాల వ్యాప్తి కొరకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసిన ప్రతిసారి కరీంనగర్, వర్ధన్నపేట, చెన్నూరు, మేటిపల్లి జిల్లాలలో బాధ్యతగా పనిచేయడం జరిగింది, 100 సార్లు పైగా అరెస్టులు లాఠీ దెబ్బలు జైలు జీవితం గడపడం జరిగింది. ఉద్యమం నడిపే క్రమంలో ఆర్థికంగా ,కుటుంబ పరంగా నష్టపోవడం జరిగింది,పీజీ ఉన్నతంగా చదువుకున్న నేను అన్ని విధాలుగా నష్టపోయాను. 2012లో అలనాటి సమైక్య పార్టీలు, వైయస్సార్ పార్టీకి చెందిన కొంతమంది జూలూరుపాడు మండలం బేతాళ పాడు గ్రామంలో నాపైన టిఆర్ఎస్ కార్యకర్తల పైన దాడి జరిపించడం జరిగింది. ఈ క్రమంలోనే నా తల పగలటం నా భుజం విరగడం జరిగింది ఆ దాడిలో చావు నుండి బయటపడ్డాను. ఇంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అంకుటిత దీక్షగా కెసిఆర్ నాయకత్వంలో పనిచేసే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమైన వారిలో ఒకరిగా ఉన్నాను. నాకు 2014 తెలంగాణ రాష్ట్ర సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. ఆనాటి నుండి నేటి వరకు సుమారు 22 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో ఆనాడు ఉద్యమం కోసం నేడు పార్టీ కోసం , పని చేశాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంతమంది నాపై దాడి చేసిన పట్టు విడవక పార్టీ ప్రయోజనాలే ముఖ్య ఉద్దేశంతో పనిచేశాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి నా కుటుంబాన్ని వదిలిపెట్టి పార్టీ కొరకు రోజులు తరబడి గెలుపు కొరకు పనిచేశాను. గనుక ఈసారైనా నా సేవలను పార్టీ గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఈ రాష్ట్ర సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కోరుకుంటున్నాను అని చెప్పారు