EducationTelangana

పోలీస్ అభ్యర్థులకు అలెర్ట్ సాయంత్రం 5 గంటల వరకే అవకాశం

పోలీస్ అభ్యర్థులకు అలెర్ట్ సాయంత్రం 5 గంటల వరకే అవకాశం

తెలంగాణ లో ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐ (ఫింగర్‌ ప్రింట్స్‌) మెయిన్స్‌ పరీక్షల ప్రిలిమినరీ కీని (SI Exam Primary Key) తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు రోజుల కిందట విడుదల చేసింది
ప్రాథమిక కీ ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ఏవైనా అ భ్యంతరాలు ఉంటే ఈ నెల 14న సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని బోర్డు పేర్కొంది. అంటే రేపటితో ఈ కీకి సంబంధించి అభ్యంతరాల గడువు ముగియనుంది. అభ్యర్థులు అభ్యంతరాలకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లను పీడీఎఫ్/జేపీఈజీ ఫార్మాట్లో అప్ లోడ్ చేయాలని అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే సంబంధిత ఆధారాలను నిర్ణీత నమూనాలో అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్‌ కాపీలు తుది ‘కీ’ విడుదల సమయంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ, ఎస్‌ఐ ఐటీ అండ్‌ సీఓ టెక్నికల్‌ పేపర్ల (ఆబ్జెక్టివ్‌ టైప్‌) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్‌ఐ పీటీవో పరీక్షను మార్చి 26న నిర్వహించారు. ఏప్రిల్ 08, 09 తేదీల్లో సివిల్ ఎస్సై పోస్టులకు నిర్వహించిన పరీక్షలను తెలంగాణ వ్యాప్తంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించారు. మొదటి రోజు మ్యాథ్స్, ఇంగ్లీష్ పేపర్(English Paper) ను నిర్వహించగా.. ఏప్రిల్ 09వ తేదీన జనరల్ స్టడీస్ అండ్ తెలుగు పేపర్స్ పరీక్షలు జరిగాయి.

ఉద్యోగాలు .. “>

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లోని 81 కేంద్రాల్లో ఎస్‌ఐ రాత పరీక్ష జరిగింది. ఎస్‌ఐ(సివిల్), ఎస్‌ఐ(ఐటీ), ఎస్‌ఐ(పీటీఓ), ఏఎస్‌ఐ(ఫింగర్ ప్రింట్) విభాగంలో 4 పేపర్లకు పోలీసు నియామక మండలి పరీక్షలు నిర్వహించింది. వేలి ముద్రలతో అభ్యర్థులను సరిపోల్చిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. త్వరలోనే వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ ‘కీ’ అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 08వ తేదీన.. హైదరాబాద్ లో మొత్తం 42 కేంద్రాలను కేటాయించగా.. దీనిలో 32,945 మంది హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాల్లో 18 కేంద్రాలను కేటాయించగా.. 12,833 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో 21 కేంద్రాలను కేటాయించగా.. మొత్తం 13,756 మంది హాజరయ్యారు. మొత్తం మీద 59,534 మంది హాజరయ్యారు. మొదటి రోజు 95.50 శాతంగా నమోదు అయింది. రెండో రోజు 58,019 మంది హాజరవ్వగా.. 95.47 శాతంగా నమోదైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected