NationalTelangana

ప్రజాస్వామ్యం కాదిది.. నియంతృత్వం. మోడీ ప్రభుత్వం పై ప్రధాన విపక్ష పార్టీల దాడి

*ప్రజాస్వామ్యం కాదిది.. నియంతృత్వం. మోడీ ప్రభుత్వం పై ప్రధాన విపక్ష పార్టీల దాడి*

2014 నుంచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, కేసుల నమోదు, అరెస్టు చేయడం వంటి సంఘటనలు గణనీయంగా పెరిగాయి.

లాలూప్రసాద్‌ యాదవ్‌ (ఆర్జేడీ), సంజయ్‌ రౌత్‌ (శివసేన), ఆజంఖాన్‌ (సమాజ్‌వాదీ పార్టీ), నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌ (ఎన్సీపీ),
నిరంకుశత్వానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టే పరాకాష్ఠ

కాస్కో మోదీ ఉమ్మడి దాడి
ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ సహా 8 ప్రధాన విపక్ష పార్టీల లేఖ

ప్రత్యర్థులను భయపెట్టేందుకే దురుద్దేశపూరిత దర్యాప్తులు

బీజేపీలో చేరితే పునీతులు.. లేదంటే దాడులు, అరెస్టులా?

విచ్చలవిడిగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
విపక్షాలే లక్ష్యంగా సీబీఐ, ఈడీ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులు

రూ.78 వేల కోట్ల ప్రజాధనం లూటీ అయితే దర్యాప్తు ఏది?

రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర గవర్నర్లు

2014 నుంచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, కేసుల నమోదు, అరెస్టు చేయడం వంటి సంఘటనలు గణనీయంగా పెరిగాయి. లాలూప్రసాద్‌ యాదవ్‌ (ఆర్జేడీ), సంజయ్‌ రౌత్‌ (శివసేన), ఆజంఖాన్‌ (సమాజ్‌వాదీ పార్టీ), నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌ (ఎన్సీపీ), అభిషేక్‌ బెనర్జీ (టీఎంసీ) మొదలైన ప్రతిపక్ష నేతలు అనేకమంది సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే.. కేంద్రంలోని పాలకవర్గానికి అనుబంధ విభాగాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనే అనుమానానికి బలం చేకూరుతున్నది.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఓ అంతర్జాతీయ ఫోరెన్సిక్‌ ఆర్థిక పరిశోధన సంస్థ ఇటీవల నివేదికను ప్రచురించింది. మారెట్‌ క్యాపిటలైజేషన్‌లో తమ షేర్లు రూ.78,000 కోట్లకు పైగా ఒక నిర్దిష్ట సంస్థలో పెట్టుబడిగా పెట్టడం వల్లనే ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ నష్టపోయినట్టు తన నివేదికలో స్పష్టంచేసింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగపరిచినప్పటికీ, సంబంధిత సంస్థల ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీలు ఎందుకు ముందుకు రావడం లేదు?

దేశవ్యాప్తంగా గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాష్ట్రాల పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. గవర్నర్లు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశపూర్వకంగా అణగదొకుతున్నారు. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచేలా వ్యవహరిస్తున్నారు. సహకార సమాఖ్యస్ఫూర్తికి ప్రమాదకారులుగా తయారయ్యారు.

భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ పాలన నిరంకుశం వైపు నడిపిస్తున్నదని దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టు ఉదంతమే అందుకు నిదర్శమని స్పష్టంచేశాయి. దేశచరిత్రలో మునుపెన్నడూ లేనంతగా బీజేపీ పాలనలో కేంద్రం దర్యాప్తు సంస్థలను కుట్రపూరితంగా వాడుకుంటున్నదని మండిపడ్డాయి. రోజురోజుకూ ప్రజాస్వామ్య వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తూ.. దేశాన్ని నిరంకుశ పాలన దిశగా తీసుకెళ్తున్నదని భారత రాష్ట్ర సమితి సహా 8 విపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం వారు లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ అధినేత శరద్‌పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, జమ్ముకశ్మీర్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష పార్టీల నేతలే లక్ష్యంగా చేస్తున్న దాడులను జాతీయ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు.

‘దారికి వస్తే దర్జా.. లేదంటే కబ్జా’ అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నదని, బీజేపీయేతర పాలిత రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయటమే పనిగా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల్లో ఉండి బీజేపీలో చేరగానే అం తకు ముందు సీబీఐ, ఈడీ దాడులను ఎదుర్కొన్న వారు పుణీతులైన సందర్భాలను లేఖలో ఉదహరించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ల వ్యవస్థను కేంద్రం తన స్వార్థానికి వినియోగిస్తున్నదని విమర్శించారు. గవర్నర్ల వ్యవస్థనూ కేంద్రం దుర్వినియోగం చేస్తున్న తీరుపై పలు ఉదంతాలను లేఖలో ప్రస్తావించారు. ప్రధాని మోదీకి కేసీఆర్‌ సహా నలుగురు ముఖ్యమంత్రులు, బీఆర్‌ఎస్‌ సహా 8 రాజకీయ పార్టీలు రాసిన లేఖ పూర్తి పాఠం.. యథాతథంగా…

సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. రాజకీయ కుట్రతో కూడినవి. ఈ అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. పాఠశాల విద్యలో సంసరణలను తీసుకొచ్చిన మనీశ్‌ సిసోడియా.. ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందారు. ‘రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే లక్ష్యంతో చేపట్టే దురుద్దేశపూర్వక దర్యాప్తు లేదా చర్య’కు తారాణం గా సిసోడియా అరెస్టు నిలిచింది. నిరంకుశ బీజేపీ పాలన ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టుగా అనుమానిస్తున్న ప్రపంచానికి మనీశ్‌ సిసోడియా అక్రమ అరెస్టు ఆ అనుమానాలను నిజం చేసింది.

బీజేపీలో చేరగానే పుణీతులా..?

మీ పరిపాలనలో 2014 నుంచి దర్యాప్తు సంస్థల ద్వారా కేసులు నమోదు చేసి అరెస్టు చేయబడిన, దాడులకు గురై విచారించబడిన మొత్తం రాజకీయ ప్రముఖుల్లో అత్యధికులు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారే. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటం టే.. బీజేపీలో చేరిన ప్రతిపక్ష రాజకీయ నాయకుల కేసుల పరిశోధనలో దర్యాప్తు సంస్థలు సంయమనంతో ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు, 2014, 2015ల్లో శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో కాంగ్రెస్‌ మాజీ నేత, ప్రస్తుత అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై సీబీఐ, ఈడీ విచారణ జరిపాయి. కొద్దికాలానికి ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు నీరుగారిపోయింది. అలాగే ‘నారద స్టింగ్‌ ఆపరేషన్‌’ కేసులో టీఎంసీ పార్టీకి చెం దిన మాజీ నాయకులు సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌లను సీబీఐ, ఈడీలు వెంటాడినప్పటికీ.. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారిద్దరు బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఈ కేసుల విచారణలో ఉలుకూ పలుకూ లేదు. మహారాష్ట్రకు చెందిన నారాయణ్‌ రాణే ఉదంతంలోనూ అలాగే జరిగింది.

ప్రతిపక్షాల అడ్డు తొలగింపే లక్ష్యంగా దాడులు

2014 నుంచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటి సంఘటనలు గణనీయంగా పెరిగాయి. లాలూప్రసాద్‌ యాదవ్‌ (రాష్ట్రీయ జనతాదళ్‌), సంజయ్‌ రౌత్‌ (శివసేన), ఆజంఖాన్‌ (సమాజ్‌వాదీ పార్టీ), నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌ (ఎన్సీపీ), అభిషేక్‌ బెనర్జీ (టీఎంసీ) మొదలైన ప్రముఖ ప్రతి పక్షనేతలు అనేకమంది సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనలను పరిశీలిస్తే.. కేంద్రంలోని పాలకవర్గానికి అనుబంధ విభాగాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనే అనుమానానికి బలం చేకూరుతున్నది.

ఇలాంటి అనేక సందర్భాల్లో నమోదైన కేసులు, అరెస్టులు, వాటి సమయ సందర్భాలను పరిశీలిస్తే ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయని, అవి రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రతిపక్షాలను అణచివేయడం, అడ్డు తొలగించుకోవడం కోసమే ఆ పార్టీలకు చెందిన కీలక నేతలను లక్ష్యంగా చేసుకున్నారని జరిగిన దాడులు, జరుగుతున్న సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని చెప్పటానికి ఇంతకన్నా ఉదహరణలేం కావాలి? ప్రతిపక్షాలకు కట్టడిచేయటానికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ)నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తమ ప్రాధాన్యతలను ఏజెన్సీలు ఎప్పటికప్పుడు మార్చుకున్నాయని స్పష్టమవుతున్నది.

 

ఎస్‌బీఐ, ఎల్‌ఐసీకి తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఓ అంతర్జాతీయ ఫోరెన్సిక్‌ ఆర్థిక పరిశోధన సంస్థ నివేదికను ప్రచురించింది. మారెట్‌ క్యాపిటలైజేషన్‌లో తమ షేర్లు రూ.78 వేల కోట్లకు పైగా ఒక నిర్దిష్ట సంస్థలో పెట్టుబడిగా పెట్టడంతోనే ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ సంస్థలు నష్టపోయినట్లు ఆ సంస్థ తన నివేదికలో స్పష్టంచేసింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినప్పటికీ, సంబంధిత సంస్థల ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీలు ఎందుకు ముందుకు రావడం లేదు?

సమాఖ్యస్ఫూర్తిని ప్రదర్శించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అయినప్పటికీ రాష్ట్రాలు సమాఖ్యస్ఫూర్తిని ప్రదర్శిస్తూ రాజ్యాంగ విలువలను పాటిస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థ అనుసరిస్తున్న సమాఖ్య వ్యతిరేక వైఖరి ఫలితంగా.. ప్రజాస్వామ్యంలో నేడు గవర్నర్ల పాత్ర అవసరమా? అని దేశ ప్రజలు ప్రశ్నించటం ప్రారంభించారు. గవర్నర్‌ కార్యాలయాలను, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తూ ఎన్నికల క్షేత్రానికి వెలుపల తలపడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మన దేశ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడమే తప్ప మరొకటి కాదు. 2014 నుంచి ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తున్న తీరు, వాటి ప్రతిష్ఠను మసకబారేలా చేసింది. దాంతోపాటు ఆ సంస్థల స్వయంప్రతిపత్తి, నిష్పాక్షికతపై ప్రశ్నలను లేవనెత్తింది. వీటిపై భారత ప్రజలకు నానాటికీ విశ్వాసం సన్నగిల్లుతున్నది. మీ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాసరే.. వేరే పార్టీ భావజాలానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పును మీరు గౌరవించి తీరాల్సిందే. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టమే అత్యున్నతం. అంతిమం.

కే చంద్రశేఖర్‌రావు (బీఆర్‌ఎస్‌)
మమతా బెనర్జీ (టీఎంసీ )
అర్వింద్‌ కేజ్రీవాల్‌ (ఆప్‌)
భగవంత్‌ మాన్‌ (ఆప్‌)
తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ)
ఫరూక్‌ అబ్దుల్లా (జేకేఎన్సీపీ)
శరద్‌ పవార్‌ (ఎన్సీపీ)
ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన, యూబీటీ)
అఖిలేష్‌ యాదవ్‌ (ఎస్పీ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected