
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి వినతి పత్రం అందజేత
సికే న్యూస్ ప్రతినిధి
ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ ను హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యుడు తాళ్లూరి దిలీప్ చౌదరి కలిసి
న్యాయవాద సమస్యలపై వినతి పత్రం అందజేశారు.. వెంటనే స్పందించిన వినోద్ కుమార్
నూతనంగా బార్ కౌన్సిల్లో నమోదు కాబడిన జూనియర్ న్యాయవాదుల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హెల్త్ కార్డులు వెంటనే మంజూరుచేయాలని లా సెక్రెటరీని చరవాణి ద్వారా ఆదేశించారు అలాగే గతంలో హెల్త్ కార్డు కలిగిన న్యాయవాదులకు జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు..
న్యాయవాదుల అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనని, న్యాయవాదుల రక్షణకై న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయడంలో ఒక న్యాయవాదిగా కృషి చేస్తానని మరియు దళిత న్యాయవాదులందరికీ దళిత బంధు వర్తించేలా కృషి చేస్తానని మరియు న్యాయవాది మరణించిన ఎడల ప్రస్తుతం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఇస్తున్న నాలుగు లక్షల రూపాయలు కాకుండా అదనంగా ప్రభుత్వం తరఫున మరో నాలుగు లక్షలు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే న్యాయవాదుల అభివృద్ధి కోసం గతంలో 100 కోట్లు కేటాయించిందని మరో 100 కోట్ల నిధులు
ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడి న్యాయవాద సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు