
ప్రతి ఓటర్ ను ఐదుసార్లు కలవండి
కేంద్ర, రాష్ట్రాల అభివ్రుద్దిని వివరించండి
-బెంగళూరులో పార్టీ నాయకులతో సమావేశమైన సంజయ్
-యలహంకలో పలువురు కార్యకర్తల నివాసాలకు వెళ్లి పలకరించిన బండి సంజయ్
-బండి సంజయ్ రాకతో కార్యకర్తల్లో జోష్….
-బాణాసంచా పేల్చి, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బెంగళూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతో కలిసి నగరంలోని యలహంకలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక బీజేపీ అభ్యర్ధి ఎస్.ఆర్.విశ్వనాధ్ ను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్ధించారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు.
• ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నందున ఓటర్లను కలుసుకునే కార్యక్రమాలను వేగవంతం చేయండి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి పోలింగ్ తేదీ ముందురోజు వరకు ప్రతి ఇంటికి వెళ్లండి. ఒక్కో ఓటర్ ను 5సార్లు కలవండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివ్రుద్ధిని వివరించారు. నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ చేసిన క్రుషిని వివరించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి’’అని కోరారు.
• అనంతరం బండి సంజయ్ యలహంకలోని పలువురు కార్యకర్తల నివాసాలకు వెళ్లారు. స్థానిక బీజేపీ నాయకులు ఈశ్వరప్ప, ఏ.ఎస్.రాజన్న సహా పలువురు ఇండ్లకు వెళ్లారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని సూచించారు.
• మరోవైపు బండి సంజయ్ రాకతో బెంగళూరు బీజేపీ పార్టీ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. తెలంగాణ టైగర్ బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. సెల్ఫీల కోసం ఎగపడ్డారు. ప్రతి ఒక్కరితో ఓపికగా బండి సంజయ్ సెల్పీ దిగారు.