Telangana

ప్రభుత్వ బడులలో పేద విద్యార్థులకు కరువైవుతున్న నాన్యమైన విద్య.

ప్రభుత్వ బడులలో పేద విద్యార్థులకు కరువైవుతున్న నాన్యమైన విద్య.

ప్రభుత్వ బడులలో పేద విద్యార్థులకు కరువైవుతున్న నాన్యమైన విద్య.

*అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే మండలంలోని సగం మంది ప్రభుత్వ పాఠశాలల్లోని చదివిన పదోవ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.

*ప్రెవేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు బ్రహ్మాoడంగా పాస్ అయ్యారు.

*ఇంకా ఏ నమ్మకంతో విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు.

*ఫెయిల్ అయిన విద్యార్థులను చూసి తల్లిదండ్రులు పడే మనోవేదనకు సక్రమంగా తమ భాద్యతని నిర్వర్తించని ఉపాధ్యాయులే కారణం

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, ,మైనార్టీ, ఓ సిలోని మా పేద విద్యార్థులకు చదువుని దూరం చెయ్యాలని చూస్తే సహించం

*పదోవ తరగతి రీసల్ట్ రివ్యూని తక్షణమే చేపట్టాలి.

*పాస్ పర్సంటెజ్ తక్కువ వచ్చిన పాఠశాలలోని ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి వారి స్థానంలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులను నియమించాలి.

*సక్రమంగా పర్యవేక్షణ జరుపకుండా అత్యంత నిర్లక్ష్యoగా వ్యవహరించి విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడిన జిల్లా విద్యా అధికారి (డి ఈ ఓ)ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి

పడిపోయిన చర్ల మండల పదోవ తరగతి ఫలితాలకు జిల్లా కలెక్టరే భాద్యత వహించాలి *జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా చర్ల మండలానికి పరిమినెంట్ ఎం ఈ ఓ ని నియమించాలి *చర్ల మండల విద్యా వ్యవస్థ అభిహృద్ధి పై అధికారుల నిర్లక్ష్యం విడాలి. *జిల్లా కలెక్టర్ మరియు ఐ టి డి ఏ, పి ఓ లు ప్రత్యేక దృష్టి సారించి చర్ల మండల విద్యా వ్యవస్థ అభివృద్ధి కై ఐఖ్య కార్యాచరణ చేపట్టాలి. *లేని యడల చర్ల మండల విద్యార్థుల భాష్యత్ కై విద్యావ్యవస్థ అభిహృద్ధికై ప్రజలను ఐక్యం చేసి విస్తృతమైన ఉద్రుతమైన పోరాటాలు నిర్వహిస్తాం. సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్.

సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),

మే 17,

చర్ల మండలంలో కామ్రేడ్ డి వి కే భవన్లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ చర్ల మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ చర్ల మండలంలోని ప్రభుత్వ బడుల్లో చదువులు కొనసాగిస్తున్న పేద విద్యార్థులకు నాన్యమైన విద్య అందడంలేదు దానికి నిదర్షణమే ప్రస్తుతం మన కళ్ళముందు ఓటమి పాలై కనబడుతున్న పదోతరగతి ఫలితాలే సాక్ష్యం చర్ల మండలం లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు మండలం మొత్తం 9 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మొతంగా 278 మంది విద్యార్థులకు 135 మంది పాస్ అయ్యారు 143 మంది ఫెల్ అయ్యారు అంటే సగానికి మించి విద్యార్థులు ఫెయిల్ అయ్యారు

జి హెచ్ ఎస్ చర్ల 64 మందికి 33 మంది పాస్ మాత్రమే పాస్ అయ్యారు మిగిలిన 31 మంది ఫెయిల్ జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ చర్ల 24 మంది విద్యార్థులకు కేవలం 9 మంది పాస్ మిగిలిన 15 మంది ఫెయిల్ అయ్యారు జడ్.పి.హెచ్.ఎస్ తేగడ 17 మంది విద్యార్థులకు 8 మంది మాత్రమే పాస్ మిగిలిన 9 మంది ఫెయిల్ అయ్యారు జడ్.పి.హెచ్.ఎస్ సత్యన్నారాయణపురం 36 మందికి కేవలం 15 మంది విద్యార్థుల్ పాస్ అయ్యారు మిగిలిన 21 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు జడ్.పి.హెచ్.ఎస్ కుదునూరు 9 మందికి 6 మంది పాస్ అవగా 3 మంది ఫెయిల్ అయ్యారు జడ్.పి.హెచ్.ఎస్ చిన్నమిడిసీలేరు 18 మంది ఉండగా 12 మంది పాస్ అయ్యారు 6 మంది ఫెయిల్ అయ్యారు ఏ జి హెచ్ ఎస్ పెద్దమిడిసీలేరు ఆశ్రమ పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా కేవలం 21 మంది మాత్రమే పాస్ అయ్యారు 34 మంది ఫెయిల్ అయ్యారు ఏ హెచ్ ఎస్ ఉంజూపల్లి లో 21 మంది విద్యార్థులు ఉండగా కేవలం 11 మంది పాస్ అయ్యారు మిగిలిన వారు 10 మంది ఫెయిల్ అయ్యారు కే జి బి వి చర్ల లో 34 మందివిద్యార్థులు ఉండగా 20 మంది పాస్ అయ్యారు 14 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు

ఇది అత్యంత దూర్మార్గమైన విషయం ఇది కేవలం ఈ చర్ల మండల విద్యా వ్యవస్థపై అధికారులు కనబరిచిన నిర్లక్ష్యమే కారణం మండలంలో పరిమినెంట్ ఎం ఈ ఓ ని నియమించండని ప్రజాపంథా పార్టీగా ఈ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన ఎన్ని పోరాటాలు చేసినా యంత మోతుకున్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు ఆ నిర్లక్ష్యం ఫలితంగానే ఈ రోజు మండలంలో ఈ విధమైన పరీక్ష ఫలితాలను వచ్చాయ్ కిందినుంచి పై దాకా ఉపాధ్యాయులు ఇంచార్జ్ ఎం ఈ ఓ, డి ఈ ఓ కలెక్టర్ ప్రతి స్థాయిలో తీవ్రమైన నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం ఈ విద్యా సంవత్సరo లో జరిగింది దాని ఫలితంగా నిరుపేద విద్యార్థులు బలి అయ్యారనీ ఆవేదన వ్యక్తం చేశారు ఏ ఒక్క ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం లేదు ప్రెవేట్ బడులల్లో చదివిస్తున్నారు ఒక పక్క ఇదే ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పే విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు ప్రవేటు బడుల్లో చదువుకొనే ఈ ఉపాధ్యాయుల పిల్లలు పాస్ అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏ నమ్మకంతోటి తల్లి దండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలాలకు చదువుకోవడం కోసం పంపిస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పాఠశాలల్లో సరైన కనీసం వసతులు కల్పించకుండా అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించ కుండా పేద విద్యార్థులను చదువుకోకుండా చేసి ఆదిలోనే ఈ సర్కార్ నిరుపేద్దల అభిహృద్ధిని భవిష్యత్తుని చిదిమేస్తుందని అన్నారు కెసిఆర్ ప్రభుత్వానికి మాటల్లో వున్నా పస చేతల్లో లేదని విమర్శించారు ఫెయిల్ అయిన విద్యార్థులను చూసి తల్లిదండ్రులు పడుతున్న మనోవేదనకు సక్రమంగా విధులు నిర్వర్తించని ఉపాధ్యాయు లే కారణమని అన్నారు ఇప్పటి వరకు ఎందుకు రిజల్ట్ రివ్యూ నీ ప్రకటించలేదని అన్నారు పదోవ తరగతి రీసల్ట్ రివ్యూని తక్షణమే ప్రకటించాలి పాస్ పర్సంటెజ్ తక్కువ వచ్చిన పాఠశాలలోని ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి వారి స్థానంలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులను నియమించాలి సక్రమంగా పర్యవేక్షణ జరుపకుండా అత్యంత నిర్లక్ష్యన్ని కనబరిచి విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడిన జిల్లా విద్యా అధికారి ( డి ఈ ఓ)ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి పడిపోయిన చర్ల మండల పదోవ తరగతి ఫలితాలకు జిల్లా కలెక్టరే భాద్యత వహించాలి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా చర్ల మండలానికి పరిమినెంట్ ఎం ఈ ఓ ని నియమించాలిజరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా చర్ల మండలానికి పరిమినెంట్ ఎం ఈ ఓ ని నియమించాలి చర్ల మండల విద్యా వ్యవస్థ అభిహృద్ధి పై అధికారుల నిర్లక్ష్యం విడాలి జిల్లా కలెక్టర్ మరియు ఐ టి డి ఏ, పి ఓ లు ప్రత్యేక దృష్టి సారించి చర్ల మండల విద్యా వ్యవస్థ అభివృద్ధి కై ఐఖ్య కార్యాచరణ చేపట్టాలి లేని యడల చర్ల మండల విద్యార్థుల భాష్యత్ కై విద్యావ్యవస్థ అభిహృద్ధికై ప్రజలను ఐక్యం చేసి విస్తృతమైన ఉద్రుతమైన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాలెం నాగరాజు సిమిడి సుజాత, మునిగల శివ కాపుల కృష్ణార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected