Telangana
ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్

వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్
తెలంగాణలో సంచలనం క్రియేట్ చేసిన మెడికో ప్రీతి సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన కోర్టు, రూ.10వేలరూపాయలు, ఇద్దరు పూచీకత్తుతోపాటుగా 16వారాలపాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కేసు విచారణ నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా కానీ, సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రత్నించినా కానీ బెయిర్ రద్దు చేస్తామని కోర్టు పేర్కొంది.
కాగా సైఫ్ వేధింపులు వల్లే వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రీతి మరణానికి సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు తేల్చారు. దీంతో సైఫ్ కు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పుడు ఇదే కేసులో కోర్టు సైఫ్ కు బెయిన్ ను మంజూరు చేసింది.