
సి కే న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 22,
ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఉదయం ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నకు సూర్యాపేట గ్రీన్ క్లబ్ సభ్యులు సుమారు 35 మంది పాల్గొనడం జరిగింది. అధ్యక్షులు శ్రీ ముప్పారపు నరేందర్ గారి ఆధ్వర్యంలో విచ్చేసి ప్లాస్టిక్ వినియోగం వల్ల సమాజానికి జరుగుతున్న అనర్థాల గురించి వివరిస్తూ ప్లకాడ్స్ ప్రదర్శించినారు.Perminet sign boards పరిసరాలలో అమర్చారు.Flexy లు అమర్చారు.తప్పనిసరిగా అవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ ప్లాస్టిక్ వినియోగించోద్దని పిలుపునిచ్చినారు.ఒకవేళ వినియోగించాల్సి వస్తే ప్రభుత్వ మార్గదర్శకాలమేరకు నిర్ణీత మైక్రాన్ల ప్లాస్టిక్ నే వినియోగించాలని తెలిపారు. దేవస్థానం చుట్టుపక్కల గుట్టలలో పడివున్న ప్లాస్టిక్ వేస్ట్ ను ఏరి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించారు.
ప్లాస్టిక్ వినియోగము తగ్గించాలనే అంశంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు.
వీరికి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ కృష్ణ కుమార్ గారు, దేవస్థానం ప్రముఖులు కృష్ణమోహన్ డాక్టర్ రామయ్య గారలు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించినారు.
ఈ కార్యక్రమములో గ్రీన్ క్లబ్ కార్యదర్శి తోట కిరణ్, కోశాధికారి ఉప్పల శ్రవణ్,సభ్యులు మీలా మహాదేవ్, సుధాకర్ PVC మేనేజింగ్ డైరెక్టర్,DSV శర్మ,గౌరవ మంత్రివర్యులు APS, ఉప్పల శ్రీదేవి,చివ్వెంల ఎంపీఓ T.గోపి, కార్యదర్శి B.కవిత AO కలెక్ట్రేట్,Dr. సుధీర్, అమ్మ హాస్పిటల్,గెల్లి అంజన్ ప్రసాద్,ఉపేంద్రా చారి, కృష్ణమూర్తి, హేమమాలిని, సువర్ణ లక్ష్మీ, బంగారు పద్మ, రజిని గారలు తదితరులు పాల్గొన్నారు.