Telangana
బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు అండగా సీఎం కేసీఆర్….
బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు అండగా సీఎం కేసీఆర్….

బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు అండగా సీఎం కేసీఆర్….
దళిత బందు పథకం ద్వారా కారును అందజేసిన మంత్రి ఎర్రబెల్లి….
బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన మొగిలయ్య ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు దళిత బందు పథకం ద్వారా మంజూరు అయిన కారును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మొగిలయ్య దంపతులకు అందజేశారు. ఈ సందర్బంగా మొగిలయ్య, కొమురమ్మ దంపతులుసీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.