
బాధ్యత కలిగిన కుటుంబం, సమాజంలో వారి బాధ్యతలు గుర్తించాలి..
సికే న్యూస్ ప్రతినిధి
బాధ్యత కలిగిన కుటుంబం అనే పేరుతో గడిచిన శనివారం మొదటి భాగంలో భార్య యొక్క పాత్ర గురించి చూశాము. వారంలో ఒక నూతమైన కోణంనుండి సమాజానికి అందించాలని మంచి ఉద్దేశంతో ఈ అంశాన్ని తీసుకున్నాను.
ఇది కులమతాలకు అతీతంగా ప్రతి కుటుంబం ఉన్నతమైన బాధ్యతలు కలిగి రేపటి పౌరులకు మంచిపూనాదిగా నిలువాలన్నదే నా ప్రధాన లక్ష్యం.
అందుకొరకు అనేక కోణాలనుండి కుటుంబ వ్యవస్థపై మంచి ఆర్టికల్స్ అందించాలని ఆశిస్తున్నాను. “అయితే కొన్ని అనివార్యకారణాలచే రెండోవ భాగాన్ని అందించుటకు ఆలస్యమైనందుకు చింతిస్తున్నాను. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో భార్యభార్తల యొక్క బాధ్యత చాలా ముఖ్యమైనది.
ఎవరి పాత్రవారు గుర్తించి పోసించగలిగితే ఆ “కుటుంబం సంతోషానికి నిలయంగా” ఉంటుంది మరియు మన చుట్టుపరిసర ప్రాంత ప్రజలకేకాక ఆ గ్రామానికే “ఆదర్శవంతులుగా” ఉండవచ్చు. నేడు అనాలోచనగా విచ్చిన్నం అయిపోతున్న అనేక కుటుంబాలకు ఆదర్శవంతంగా నిలువ్వాల్సిన ఆవశ్యకత ప్రతి బాధ్యత కలిగిన కుటుంబాలపై ఉందని తెలిపే క్రమములో ఈ అర్టికల్ వ్రాస్తున్న సంగతి తెలిసినదే.
కాని కొన్నిసార్లు బాధ్యతరహితంగా ఉన్న కుటుంబాలుగా అనేకుల ముందు నవ్వులపాలు కావడం కొన్నిసార్లు మన కీడును కోరుకునేవారికి పండగ వాతావరణం కలిగించవచ్చు.
కాని అట్టి అవకాశం మన బద్ద శత్రువులకుకూడా మనం కలిగించకూడదు. అయితే నిజంగా మానవత విలువలు కలిగి జీవించే ఏ మంచి భార్యభర్త బాధ్యత కలిగినవారుగా దీన్ని స్వాగతించరు. స్వాగతించకూడదుకూడా…
కారణం ఒక భార్యభర్తల బంధం వలన ఏర్పడే ఏ కార్యమైన వారి కుటుంబానికే కాక స్థానికంగా నివసించే ఇతర కుటుంబాలుకూడా ఏదో ఒకటి మననుండి నేర్చుకోవడానికి బాధ్యత కలిగి నడుచుకునే భార్యభర్తల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆశించినప్పుడు మననుండి మంచి ఫలాలే వారికి అందేలచూడాలి. కాని కుటుంబాన్ని విచ్చిన్నం చేసేవి ఉండకూడదు అనేదే ఈ శీర్షిక యొక్క ముఖ్య ఉద్దేశం..
“ఏ ఒక్క కుటుంబంలో భార్యాభర్తలకు కనువిప్పు కలిగించిన అదే పదివేలుగా సంతోషిస్తాను.” అందులో ఒక బాధ్యత కలికిగిన కుటుంబం గురించి పూర్తిగా ప్రతి శనివారం ఒక భాగాన్ని క్లుప్తంగా వివరించుటకు ఇష్టపడుతున్నాను. భార్యాభర్త గురించి ఇంకా రాలేదని సహనం కొలిపోకూడదు సుమా…!
బాధ్యత కలిగిన కుటుంబంలో భర్త యొక్క పాత్రను త్వరలోనే మీ ముందుకు చాలా క్లుప్తంగా తీసుకురావడానికి అన్నివిధాలుగా అనగా ఒక భర్తకు ఉండవలసిన మంచి లక్షణాలు మరియు బాధ్యతను గురించి సామాజిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక, కుటుంబ పరమైన సునీతమైన విషయాల్లో కచ్చితంగా భర్త గురించిన సువిశ్లేషణ అతిత్వరలోనే అందించుటకు కృషి చేస్తున్నాను… అంతవరకు మొదటి భాగం నుండి చదువుతున్న భార్యాభర్తలకే ఇది సొంతం అవుతుంది కాబట్టి వారు కచ్చితంగా ఈ అంశాన్ని అశ్వదించగలరు.
కావున ప్రతి వారంలో ఒక భాగంగా మంచి సమాజంకొరకు నా వంతు కృషి ఉంటుంది. “బాధ్యత కలిగిన కుటుంబం” అనే ఈ శీర్షికను చదవండి మరియు మీ బంధువులతో, స్నేహితులతో షేర్ చేయండి.
ఏమో చెప్పలేముకదా! మీ ద్వారా చదివిన ఒక మంచి అర్టికల్ వారిని ఆలోచింపచేయవచ్చు, మీ పక్షాన ఒక కుటుంబం బాధ్యతలు కలిగి సమాజానికి ఆదర్శవంతులుగా నిలిచిన ఆ క్రెడిట్ మీకే చెందుతుందని నా యొక్క మనవి.
మంచిని పంచుకోవడానికి పరిమితులు ఉండనవలసిన అవసరం లేదు. కాని చెడును మాత్రం మీ కాళ్ళక్రిందనే త్రోక్కివేయాలి ఒక్క అడుగుకూడా దాన్ని ముందుకు వెళ్ళనివ్వవద్దు. అది విషపురితమైన వార్త కాబట్టి ఎట్టి పరిస్థిలోకూడా విస్తరించకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గ్రహించాలి.
వీలైతే దుఃఖంలో ఉన్న భార్యభర్తలకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్త చెప్పండి. ఒకవేళ మీ దగ్గర అటువంటి మంచి విషయలులేకుంటే సాధారణంగా మాట్లాడి వారి దుఃఖన్ని మర్చిపోయి సాధారణ స్థితికి వచ్చేలా మీ వంతు కృషిని మీరు చేయండి.
బహుశా సదరు భార్యభర్తలకు మాకు ఎటువంటి బంధుత్వంలేదు అని మీరు అనుకోవచ్చు. కాని నేను ఏమంటానంటే ఒకరికి మంచిని కోరి వారి ఆవేదననుండి బయటపడేలా చేయడానికి ఎలాంటి బంధుత్వాలు ఉండనవసరంలేదు మీరు సాటి మనిషిగా గుర్తిస్తే చాలు.
గుండెనిండా గుప్పేడుప్రేమ ఉంటే చాలు మీ కల్మష్యంలేని మంచి మనసు కృంగిన కుటుంబానికి కొండంత బలాన్ని ఇస్తుంది.
మీరు వారితో మాట్లాడిన కొన్ని మంచి విషయాలు ప్రమాదకరమైన ఆలోచననుండి వారిని తప్పించవచ్చు. ఎందుకంటే మీ “మాటల్లో ఉన్న గొప్ప శక్తి మీరు అర్ధంకాకపోవచ్చు.” కాని అనుభవించే వారికి మాత్రం గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి
కొన్ని సార్లు ఆత్మహత్యనే మార్గమని అనాలోచనతో జీవితంపై విరక్తి చెందినవారికి సంతృప్తిని, జీవించాలని వారిలో నూతన ఆశలు చిగురించవచ్చు. కాబట్టి మీకు వచ్చిన అవకాశం వదులుకోక ఒకరి కన్నీటిని తూడ్చే యోగ్యతను సద్వినియోగం చేసుకుంటే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక సంతరించుకుంటుంది…
రచన: -డాక్టర్. పీటర్ నాయక్ లకావత్