Telangana

బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి…

సింగరేణి తెలంగాణ గుండెకాయ

సింగరేణి కార్మికులను నట్టేట ముంచుతున్న ప్రధానమంత్రి మోడీ

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఏప్రిల్ 08,

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సింగరేణి సంస్థ ను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇతర ప్రతినిధులు,

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఏరియా నందు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణ చేసేదెందుకు కుట్ర పడుతున్న నేపథ్యంలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన ఆదేశాల మేరకు, సింగరేణి బొగ్గుల గనుల వేలాన్ని నిర్ణయం తీసుకున్నా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరయ్యారు…

రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో మారో ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు, గత సంవత్సరం రామగుండం పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగరేణి ప్రైవేటీకరించమని మాట ఇచ్చి ఇప్పుడా మాట తప్పారని ఆయన మండిపడ్డారు, ప్రధాని ఇచ్చిన మాటకే దిక్కు లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు, సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లు ఈ విషయంపై కేంద్రంపై ఎన్నో మార్లు ఒత్తిడి తీసుకురావడం జరిగింది అన్నారు, వేలానికి పెట్టిన బొగ్గు గనులు సింగరేణి కేటాయించాలని ఎప్పటి నుంచి అడుగుతున్నామని పట్టించుకోలేదన్నారు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్రానికి తగిన పాఠం చెబుతున్నామన్నారు, సింగరేణి అంటే తెలంగాణ గుండెకాయని దాని జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు…

రేగా కాంతారావు మాట్లాడుతూ సింగరేణి కార్మికులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు, సింగరేణి ప్రైవేట్ కరించే ఉద్దేశ్యమే కేంద్రానికి లేకుంటే బొగ్గు గనులను సంస్థకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు, సింగరేణి ప్రైవేటీకరించేదేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు, దీనిని కూడా నరేంద్ర మోడీ ఆ దాని సమస్యలకు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు, సింగరేణి పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని ఆయన మండిపడ్డారు, మళ్లీ నాలుగో సారి నాలుగు బొగ్గు గనుల వేలానికి ప్రకటన ఇచ్చారని ఆయన మండిపడ్డారు సింగరేణి విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా నేడు తెలంగాణ గడ్డమీద వేలాది మందిగా సింగరేణి కార్మికులతో ధర్నా చేయడం జరిగింది ..

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు , కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్లు , అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు , ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ , సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య , వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రాముల నాయక్ , పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు , ఖమ్మం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ , ఖమ్మం నగర మేయర్ నీరజ , ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు , కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి , టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన విభాగం నాయకులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected