
*▪️బొల్లారం లో బస్సులను అందుబాటులో ఉంచండి. ▪️ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో జీడిమెట్ల డిపో మేనేజర్ గారికి వినతిపత్రం అందచేత.* పటాన్ చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ *ఎన్ ఎస్ యూ ఐ* ఆధ్వర్యంలో *జీడిమెట్ల డిపో మేనేజర్* గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “మా బొల్లారం ప్రాంతంలో విద్యార్థులకు మరియు వేతన కూలీలకు బస్సు సౌకర్యం సరిగ్గా లేదని ముందు *10 బస్సుల వరకు వచ్చేవని ప్రస్తుతం వాటి సంఖ్య 2కు* పడిపోయిందని దీనివల్ల అటు విద్యార్థులు,ఇటు కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దయచేసి బస్సుల సంఖ్య పెంచి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లారం *ఎన్ ఎస్ యూ ఐ ప్రెసిడెంట్ రన్జన్ యాదవ్,జనరల్ సెక్రటరీ విజయ్ రెడ్డి ఎన్ ఎస్ యూ ఐ సభ్యులు సునీల్, హేమంత్,ఓంపాల్,అరుణ్* తదితరులు పాల్గొన్నారు.