భద్రాచలంలో గంజాయి పట్టివేత.

భద్రాచలంలో గంజాయి పట్టివేత.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 07,
భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఉత్తర్వుల మేరకు గురువారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శ్రీకాంత్ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా భద్రాచలం పట్టణానికి కు చెందిన ముగ్గురు వినయ్ కుమార్, విష్ణువర్ధన్ మరియు రమాదేవి లు ఆటోరిక్షా మరియు హీరో ప్లెజర్ ప్లస్ మోటార్ సైకిల్ లలో 14 కిలోల గంజాయినీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోగల సీలేరు వద్ద కొనుగోలు చేసి భద్రాచలం వద్ద ఇసుక ర్యాంప్ వద్ద దాచిన గంజాయిని బూర్గంపాడు కు అక్రమంగా తరలిస్తుండగా ముగ్గురుని పట్టుకోవడం జరిగింది. మరో నలుగురు కూడా ఈ అక్రమ గంజాయి తరలింపులో భాగస్వాములుగా ఉన్నారు. పట్టుబడిన గంజాయి 2,80,000/- విలువ ఉంటుంది. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగింది.