
భద్రాచలంలో జరిగింది సీతారాముల కళ్యాణమా! లేక లక్ష్మీనారాయణ కళ్యాణమా!
భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మార్చ్ 30,
భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం లో సీతారామచంద్రుల గోత్ర ప్రవరలు చెప్పకుండా, లక్ష్మినారాయణ గోత్ర ప్రవరాలతో కళ్యాణం జరిపించడం వల్ల అది లక్ష్మీనారాయణ కళ్యాణం అవుతుంది తప్ప సీతారాముల కళ్యాణం కాదు అని శ్రీరామ భక్తులు ఆవేదన చెందుతున్నారని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు బూసి రెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి సమక్షంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎదురుగా లక్ష్మీనారాయణ గోత్ర ప్రవరాలతో కళ్యాణం చేయటం సీతారాములకు అపచారం చేయడమేనని, అసలు సిసలు సీతారాముల కళ్యాణం గా ప్రచారం చేసి యదేచ్ఛగా దైవాపచారానికి పాల్పడుతూ లక్ష్మీనారాయణ కళ్యాణం జరిపిస్తూన్న, భద్రాచలం దేవస్థానంలో పనిచేస్తున్న మతపర సిబ్బందిని సమూలంగా బదిలీ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సమర్థుడైన ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న రాష్ట్రంలో, దేశంలోనే ప్రసిద్ధి చెంది దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ రకమైన దైవ అపచారం చోటు చేసుకోవడం దురదృష్టకరంగా తాను భావిస్తున్నట్టు డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి వెల్లడించారు
పట్టాభిషేకం తర్వాత నుండి జరిగే నిత్య కళ్యాణం లో అయినా కనీసం అసలు సిసలు శ్రీసీతారాముల కళ్యాణం సీత రాముల గోత్ర ప్రవరల తోనే కళ్యాణం జరిపించాల్సిందిగా ప్రభుత్వానికి డాక్టర్ భూసిరెడ్డి శంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.