
భద్రాచలం బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహం.
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
జూన్ 10,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం బ్రిడ్జి 4వ పిల్లర్ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
నిత్యం వృత్తి రిత్యా రద్దీగా ఉండే బ్రిడ్జి పక్కన మృతదేహం కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యామని తెలిపారు.