
భద్రాచల కరకట్ట ఎత్తును పది మీటర్లు పెంచాలి
తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ
సికే న్యూస్ ప్రతినిధి
భద్రాచల ప్రాంతం దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్నది. అటువంటి భద్రాచల ప్రాంతం వరదల్లో చిక్కుకొని అపార నష్టం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అందుకే భద్రాచల కరకట్ట ఎత్తును ఐదు నుంచి పది మీటర్ల ఎత్తు పెంచాలని, అదేవిధంగా ఆంధ్రాలో విలీనమైన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, పోలవరం ఎత్తును పెంచకుండా చూడాలని తెలంగాణ రక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది
అదేవిధంగా వరద సహాయక చర్యల్లో భాగంగా ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో కొన్ని కుటుంబాలకి పదివేల రూపాయలు అందించి మిగతా వారికి మొండి చేయి చూపారు కావున సమగ్ర దర్యాప్తు జరిపి పదివేలు అందకుండా మింగివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
వరద సహాయ చర్యల్లోజరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి అని తెలంగాణ రక్షణ సమితి కోరుకుంటుంది
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రాచల ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం విచారకరమని నరాల సత్యనారాయణ తెలియజేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి నిధులు విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని నరాల సత్యనారాయణ తెలియజేశారు
ఈ మధ్యకాలంలో సినీ హీరో ప్రభాస్ 10 లక్షల రూపాయలను ఆలయంలో ఉచిత అన్నదానానికి ప్రకటించడం చాలా హర్షనీయమని నరాల సత్యనారాయణ తెలియజేశారు.
భద్రాచలాన్ని రక్షించుకోవాలంటే భద్రాచల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది