
భద్రాద్రిలో ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
భద్రాచలం రాములోరి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్యను పోలీసులు అడ్డుకున్నారు. కళ్యాణవేదిక వద్దకు ఎమ్మెల్యేను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో ఆయన వాగ్వివాదానికి దిగారు. కుటుంబ సభ్యులను, కార్యకర్తలను కూడా అనుమతించాలని ఎమ్మెల్యే కోరారు. అయితే ఆయన ఒక్కరికే అవకాశం ఉందని పోలీసులు తెలపగా.. కాసేపు ఎమ్మెల్యే వారించారు. చివరకి ఆయనను మాత్రమే లోపలికి పంపించారు.