భూకబ్జా కేసులో ఖమ్మం జైలుకు వెళ్ళిన వేముల శ్రీనివాస్ నువ్వా మా మా నాయకునిపై మాట్లాడేది..

భూకబ్జా కేసులో ఖమ్మం జైలుకు వెళ్ళిన వేముల శ్రీనివాస్ నువ్వా మా మా నాయకునిపై మాట్లాడేది..
భూకబ్జా కేసులో విద్యాసాగర్ నీపై ఉన్న CID కేసు మర్చిపోయావ ?
సొంత పార్టీ నేతలైన మీరు భూకబ్జాలకు పాల్పడుతూ మా నాయకునిపై నిందలు వేస్తారా ?
డివిజన్లో ఎవరిని ఎవరు తిరుగనియ్యరో ఎవరిని ఎవరు తరిమివేస్తారో మీరు మాకు చెప్పుడు కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు చెబుతారని అన్నారు…. విలేఖరుల సమావేశం కాంగ్రెస్ నేతలు… డాక్టర్ రామకృష్ణ
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు కార్పోరేటర్లతో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ..
తాడిశెట్టి విద్యాసాగర్, వేముల శ్రీనివాస్, మాడిశెట్టి శివ శంకర్ గారు, సోదా కిరణ్ మీరు చేసే పనులకు, కబ్జాలకు, వివిధ రకాల అన్యాయాలకు వేరే వారి మీద బురదజల్లడం ముఖ్యంగా మా జిల్లా అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
ప్రజల సమస్యలు తీరుస్తాడని, అభివృద్ధి చేస్తాడని ప్రజలు మీ నాయకుడుని ఎం.ఎల్.ఏ.గా గెలిపిస్తే మీ ఎం,ఎల్.ఏ. చేసింది ఏంటి? భూకబ్జాలు, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటూ అభివృద్దిని గాలికొదిలేసి, వచ్చిన అభివృద్ధి నిధులను ఖర్చు చేయకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న మిమ్ములను నిలదీస్తే మా నాయకుని పై అవాకులు చవాకులు మాట్లాడుతారా ?
మీ నాయకుడు అన్ని విధాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేరుస్తే మేం కరపత్రాల్లో ముద్రించిన సమస్యలపై హామీలపై మాట్లాడడానికి మీ నాయకునికి భయమెందుకు వేస్తోంది ?
భూ కబ్జా కేసులో మొన్ననే కదా వేముల శ్రీనివాస్ నువ్వు ఖమ్మం జైలుకు వెళ్లి వచ్చింది. భూ కబ్జా దారుడు నువ్వు కాదా ?
సొంత పార్టీ నేతలైన మీరు భూకభాలకు పాల్పడుతూ మా నాయకునిపై నిందలు వేస్తారా ?
మీరు చేస్తున్న అన్యాయాలు, భూకబ్జాలు ప్రజలకు తేలియాదా ?
సోదా కిరణ్ నువ్వు నీ అన్యాయాల గురించి ప్రజలకు తెలియదా ?
సోదా కిరణ్ నువ్వు ఒక వ్యక్తిని ములుగు నుండి తీసుకొని వచ్చి హన్మకొండ లో అతనిని చితకబాడితే నీ విషయంలో అప్పటి CI దయాకర్ గారు సస్పెండ్ అయిన విషయం నువ్వు మర్చిపోయావ?
అకారణంగా నీ విషయంలో అధికారిని బలిపశువును చేసిన సంగతి మర్చిపోయావ ?
మాజీ కార్పొరేటర్ శివశంకర్ కి శాయంపేట కబ్జా రాజు అని పేరే ఉంది
మీరు భూకబ్జాలు చేసి, కేసుల్లో జైలుకు పోయిన వాళ్ళు
కబ్జా కేసులో విద్యాసాగర్ నీపై ఉన్న CID కేసు మర్చిపోయావ ?
కబ్జాలు చేసిది మీరు, కేసులు ఉన్నది మీపై జైలుకు పోయింది మీరు ప్రజలకు తెలియదా ?
మీరా మా మచ్చ లేని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిపై అవాస్తవాలు మాట్లాడుతూ బురద జల్లుతున్నారు.
ప్రతి సోమవారం పోలీస్ గ్రీవన్ సెల్ లో చుడండి 100 లో 70 శాతం కంప్లైంట్లు బిఆర్ఎస్ నేతల కబ్జాలపైనే.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున నిలబడిన అభ్యర్థికి 45 వేల ఓట్లు వచ్చాయి అదే నాయిని రాజేందర్ రెడ్డి నిలబడితే మీ నాయకుడు ఓడిపోవడం ఖాయం.
మా నాయకుడు కబ్జా చేసిండు, ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగింది అని అంటున్నారు, మరి మీరే కదా అధికారంలో ఉన్నారు కేసులు పెట్టండి, చార్జి షీట్ వేయండి విచారణ చేయండి దాంట్లో నిజానిజాలు తెలుస్తాయి కదా ?
ప్రజల్లో రొజు రోజుకు మీ నాయకుని గ్రాఫ్ పడిపోతుంది అనే ఉద్దేశంతోనే ప్రజలను మభ్య పెట్టడానికి భూకబ్జా దారులతో ప్రెస్ మీట్ పెట్టించి నాయిని రాజేందర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
కలెక్షన్ కింగ్ అంటున్నారు, కలెక్షన్ కింగ్ అయితే నాయిని రాజేందర్ రెడ్డి మీద మర్డర్ కేసు ఎందుకు పెట్టారు?
అను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి నిందలా ?
దోచుకోవడం దాచుకోవడం మీ సంస్కృతి
మీరు రాజకీయాల్లో వచ్చింది ప్రజా సేవ చేయడానికి దోచుకోవడానికి కాదు ఇది గుర్తుపెట్టుకోండి
మీరు మా నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డి పై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మా నాయకుడు భయపడేది లేదు.
జోడ్ యాత్రలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా అధికార పార్టీ నాయకులను నిలదీస్తే వాటికి సూటిగా జవాబు చెప్పే ధైర్యం లేక మాపై కేసులు పెడుతున్నారు.
డివిజన్లో ఎవరిని ఎవరు తిరుగనియ్యరో ఎవరిని ఎవరు తరిమివేస్తారో మీరు మాకు చెప్పుడు కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, ఆల్ ఇండియా ఎస్.సి.డిపార్ట్మెంట్ కన్వీనర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, INTUC చైర్మన్ కూర వెంకట్, NSUI జిల్లా అద్యక్షుడు పల్లకొండ సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, జిల్లా IT వింగ్ చైర్మన్ వింజమూరి లక్ష్మి ప్రసాద్, బొంత సారంగం, డివిజన్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.