మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంగీలాల్ నాయక్ ను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

కెసిఆర్ అసమర్థ పాలనను తీవ్రంగా ఖండించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంగీలాల్ నాయక్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ఇలా దౌర్జన్యంగా ముందస్తు అరెస్టు చేసిన పోలీసులపై మండిపడ్డ జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్.
ఈ సందర్భంగా మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించడం చేతగాని దద్దమ్మలు ప్రశ్నించే గొంతుకులను ఇలా పోలీసుల చేత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తూ, పంట పొలాలకు నష్టపరిహారం ప్రకటించడానికి వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత భయం ఎందుకు, కాంగ్రెస్ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం దేనికి,పోలీస్ స్టేషన్లకు తరలించడం దేనికి, లిక్కర్ స్కామ్లు, పేపర్ లీకులు వై స్పందించని ఈ ప్రభుత్వం ఇలా ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసి తప్పును కప్పి పుచ్చుకోవడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వాంకుడోత్ కిషన్ నాయక్, కొలిపాక వెంకటేశ్వర్లు, కొమ్మినేని రాంబాబు, గూగులోత్ శ్రీనివాసరావు, కొలిపాక శ్రీను, బానోత్ మంగు నాయక్, గూగులోత్ బాలాజీ నాయక్,బాదావత్ సామ్యా నాయక్, బానోత్ రాములు మరియు తదితరులు పాల్గొన్నారు.