
తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు.. ఇవాళ్టి నుంచే అమలు
హైదరాబాద్: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు సర్కారు వెల్లడించింది.
మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి.
ఫుల్ బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయి. అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు తేల్చారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు.