
హుస్నాబాద్ ఏప్రిల్ 27 (సి కె న్యూస్)
మనబడి వజ్రోత్సవాలు భాగంగా రక్తదాన శిబిరం
మన బడి – వజ్రోత్సవాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నాబాద్75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ,రక్త దానం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రముఖ సామాజిక కార్యకర్త ,మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పిడిశెట్టి రాజు రక్తం దానం చేయడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ,ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఇప్పటి వరకు 26సార్లు రక్తం దానం చేశామని
అదేవిధంగా పేదవారికి బియ్యం పంపిణీ ,విద్యార్థుల కు నోట్ బుక్స్ వంటి అనేక సేవా కార్యక్రమాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి ద్వారా చేపట్టడం జరిగిందని రాజు తెలిపారు.
ఈసందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సామాజిక కార్యకర్త రాజును కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ,హుస్నాబాద్ మునిసిపాలిటీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ ఛైర్మన్ ఐలేని అనితా దేవి, కొత్తపల్లి అశోక్, డాక్టర్ బి నరసింహ రావ్ లు ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మన బడి ఎస్సెస్సి 1998 -99 బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు.