
మన్ కీబాత్ కాదు ఆదివాసుల
మాటలు,బాదలు వినండి…!
-మెాదీకి బృందాకారత్ హితవు,
-తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం
బహిరంగసభలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయమంచ్ జాతీయనేత బృందాకారత్
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
( సాయి కౌశిక్),
మే 05,
ఆదివాసిపదం అంటనే మోడీకి భయం అని,ఆదివాసి హక్కులపై బీజేపీ దాడి చేస్తోందని ఆదివాసులను వనవాసిలు అని ఆర్.ఎస్.ఎస్, బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ పేర్కొన్నారు.
భద్రాచలంలో టి.ఏ.జి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివాసులు వనవాసులు కాదుఅని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ గ్రహించాలన్నారు. ఆర్ ఎస్ ఎస్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంచేయలేదని, ఆర్ ఎస్ ఎస్ వారికి లొంగిపోయింది అన్నారు.
కానీ ఆనాడు ఆదివాసులు బ్రిటీస్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆదివాసి చట్టాలపై బీజేపీ దాడిచేస్తుందని,అటవి సంరక్షణ చట్టానికి కేంద్ర బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. గ్రామసభల అనుమతి లేకుండా చట్టాన్ని మార్పు చేస్తోందని ఆరోపించారు. మెాదీకి గ్రామసభలు అవసరంలేదని, ఎందుకంటే మెాదికి అంబాని, అదాని సభలు కావాలి కాబట్టి ఆదివాసి గ్రామసభలను గుర్తించంటంలేదన్నారు.
మెాది దృష్టిలో ఇండియా అంటే అంబాని,అదాని ఇండియాగా మెాదీ మార్పుచేస్తున్నాడని విమర్శించారు. చదవుకున్న ఆదివాసి యువతి,యవకులకు ఉద్యోగాలు ఇవ్వటంలేదన్నారు. మెాదీ మాఉద్యోగాలు ఎక్కడాఅని ఆదివాసి గిరిజనసంఘం మెాదీని నిలదీస్తుందన్నారు.రైల్వే సహా అనేక కేంద్ర పరిశ్రమల్లో లక్షల్లో ఉద్యోగాలు కాళీగావున్నాయని, వాటిని భర్తీచేయాలి అని డిమాండ్ చేశారు. మెాదీ100సార్లు మన్ కీబాత్ జరిపావు… నేను అడుగుతున్నా మెాదీని ఒక్కసారి అయిన ఆదివాసుల మాట విన్నావా ? పేదల మాట విన్నావా ? అని ప్రశ్నించారు. మెాదీకి ఆదివాసులు బాద పట్టదని, మెాదీ అంబాని, అదాని మాట వింటాడని ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్లించాలన్నారు.
చత్తీస్ ఘర్ లో ఆదివాసులపై దాడులు జరుగుతున్నాయని, క్రైస్తవ మతం తీసుకుంటే ఆదివాసిలను ఎస్.టి జాబీతా నుండి తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఏ మతం తీసుకోవాలి, ఏమతాన్ని నమ్మాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, కానీ రాజ్యాంగ హక్తులపై దాడి చేయటం అమానుషం అన్నారు.
ఆదివాసులు సంసంస్కృతిని మనువాద హిందుత్వ సిద్దాంతం హైజాక్ చేస్తోందన్నారు.ఆదివాసి పండుగలు,జీవన విధానంపై సైతం దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేయటం పట్ల, బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అన్నారు.
ఆదివాసి హక్కులపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించే వారిమద్దతును ఆదివాసులు తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో బి ఆర్ ఎస్,బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంది మంచిది కానీ, రాష్ట్రంలో పోడుభూములకు హక్కులు కల్పించాలని కోరారు. ఆదివాసులకు చదువుకునే సౌకర్యాలు కల్పించాలని,ఆదివాసు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని,ఆదివాసి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మహాసభకు సభాధ్యక్షులుగా టి.ఏ.జి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు వ్యవహరించగా మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, టిఏజిఎస్ రాష్ట్ర కార్యదర్శి తోడసం భీంరావు, ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, టిఏజిఎస్ రాష్ట్ర నాయకులు పి సోమయ్య, టిఏజిఎస్ రాష్ట్ర నాయకుల బండారు రవికుమార్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు పాయం రవివర్మ, టిఐజిఎస్ జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్నవరపు కనకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జే రమేష్, టి ఏ జి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, టిఏజిఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి దుగ్గి కృష్ణ తదితరులు పాల్గొన్నారు