
మహాత్మా జ్యోతి రావు పులే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త …నాయిని
మహాత్మా జ్యోతి రావు పులే జయంతి సందర్భంగా ఈ రోజు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మహాత్మా జ్యోతి రావు పులే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన సేవలను కొనియాడారు.
అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి రావు ఫూలే. మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆశయాలను సమాజమలోని ప్రతి ఒక్కరు కొనసాగించాలని అన్నారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే సామాజిక ఉద్యమకారుడని, గొప్ప సంఘ సంస్కర్త అని, వెనుకబడిన, అట్టడుగు వర్గాల ప్రజల్లో వెలుగు నింపిన సామాజిక తత్వవేత్త అని అన్నారు. విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని, అయన చూపిన బాటలోనే అందరు నడవాలని, కుల మతాల వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడిన మాత్ముని కృషి మరువలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా INTUC చైర్మన్ కూర వెంకట్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, NSUI జిల్లా అద్యక్షుడు పల్లకొండ సతీష్, జిల్లా వికలాంగుల సంఘం అద్యక్షుడు వీరన్న, నాయకులు బొంత సారంగం, నల్ల సత్యనారాయణ, ఇప్పా శ్రీకాంత్, గుంటి స్వప్న, దేశిని ఐలయ్య, మాడిశెట్టి సతీష్, కలవచర్ల కృష్ణ, డివిజన్ అద్యక్షులు ఎస్. కుమార్ యాదవ్, మహమ్మద్ తాళ్ళపల్లి సుధాకర్, మహమ్మద్ జాఫర్, వల్లపు రమేష్, సింగారపు రవి ప్రసాద్, దోపతి రవి, బి. శ్రీధర్ యాదవ్, పోగుల సంతోష్, కొంటె సుకన్య, చింకు, తడక సుమన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.