KhammamTelangana

మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్

*మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్.*

*#ఈ రోజు యావత్ పురుషులు మనసుపూర్తిగా ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకు, స్నేహితురాలికి అభినందనలు తెలిపే రోజే 8, మార్చి 2023.*

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా నేషనల్ డీజీసీఈఓ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ చీఫ్ డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ రావు మరియు ఎన్విరాన్మెంట్ &ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

 

మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకొంటారు. ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవానికి ఒక థీమ్ UNO ప్రకటిస్తుంది ఈ సంవత్సరం థీమ్ *ఆవిష్కరణ మరియు టెక్నాలజీ లింగ సమానత్వం కొరకు*
ఈ దినాన మహిళలు ,బాలికల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ”లింగ సమానత్వం ఉన్న ప్రపంచాన్ని ఊహించండి. ఎలాంటి పక్షపాతం, మూసధోరణులు, వివక్ష లేని ప్రపంచం కొరకు ఎదురు చూడాలి. భిన్నమైన, సమానమైన, అందరినీ కలుపుకుపోయే ప్రపంచం. భిన్నత్వాన్ని గుర్తించి, విలువ ఇచ్చి, వేడుక చేసుకునే ప్రపంచం. అంతా కలసి మహిళా సమానత్వాన్ని లిఖించగలం. ఉమ్మడిగా మనమంతా వివక్షను బద్దలుకొట్టగలం *#BreakTheBias”* అన్నది 2022 నినాదం. అసలు మహిళా దినోత్సవం లక్ష్యం ఏంటంటే ఈ రోజున మహిళల హక్కులను కాపాడేందుకు , ప్రపంచవ్యాప్తంగా మహిళలు శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉంది అంతేకాక మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడడమే కాకుండా, లింగ ఆధారిత భేదాలు, సమానత్వం లక్ష్యం, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా ఈ రోజున అవగాహన కల్పిస్తారు. మహిళా సంక్షేమంపై దృష్టి సారించిన వివిధ మహిళా సంఘాలు ఈ కార్యక్రమ నిర్వహణకు నిధులు సమకూరుస్తున్నాయి. సాధారణంగా ఈ దినాన లింగ సమానత్వాన్ని వేడుకలా జరుపుకుంటాము, ఈ రోజున మహిళల విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీ, పురుషులు సమానమేననే భావనను ప్రచారం చేస్తున్నారు. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా..

కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న కారణం. *ప్రస్తుత భారతీయ సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న సామాజిక వివక్షకు కారణం స్త్రీ పురుష సమానత్వం లేకపోవడం వల్లనే సమస్యలు కలుగుతున్నాయి.* పూర్వకాలంలో స్త్రీలు వంటగదికే పరిమితమయ్యేవారు, బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి ఆచారాలతో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాజారామ్మోన్ రాయ్, అంబేద్కర్ మొదలగు మహానుభావులు స్త్రీ అభ్యున్నతికి పాటుపడ్డారు.

కాని స్త్రీలు ఇంత అభివృద్ధి, ప్రగతి సాధించినప్పటికీ వారికి గౌరవం లభిస్తుందా? స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందా? వారి కలలు సాకారం అవుతున్నాయా అంటే ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇవన్నీ ఇలావుంటే స్త్రీపై అఘాయిత్యాల పరంపర రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి. *ఉదాహరణకు ఢిల్లీలో పారామెడికల్ స్టూడెంట్ జ్యోతి సింగ్ పాండేపై జరిగిన సామూహిక అత్యాచారమే నిదర్శనం. కెరీర్‌లో పైకెదిగి తన ఇద్దరు సోదరులకు మంచి విద్యను అందించాలని ఆమె కలలు కన్నది. అయితే, ఆమె స్వప్నం బద్దలైంది. ఢిల్లీలో ప్రయాణిస్తున్న బస్సులో ఆమె ఆరుగురు వ్యక్తుల చేత సామూహిక అత్యాచారానికి గురై, అసువులు బాసింది. ప్రాణాలతో 13 రోజుల పాటు పోరాటం చేసి చివరికి డిసెంబర్ 29వ తేదీన 2012 సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది*.

అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగిన రోజే స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్ముడు జాతికి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పటికీ అది సాకారం కాలేదు. అంతకంతకూ స్త్రీలపై హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కామపిశాచులు వారిని వదలట్లేదు. ముంబై మహానగరంలో ఆరు నెలల ఆడశిశువుపై అత్యాచారం జరిగింది. ఢిల్లీలో ఏడెళ్ళ బాలికపై అత్యాచారం, తాజాగా ఓ కీచకుడు మిత్రుడి భార్యపైనే ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. బీహార్‌లోని జవాన్‌కు చెందిన మహిళపై ఆమె భర్త స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఓ విద్యార్థి చదువులు చెప్పే ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇటీవల *Dr ప్రీతి మీద జరిగిన హారాస్మెంట్ గాని రాగ్గింగ్ గాని ఆమె బంగారు భవిష్యత్తు ని నాశనం చేసాయి* స్త్రీ మీద జరిగే అన్యాయాలు ముగిసి..
ఇలా పలు సందర్భాలను గుర్తుచేసుకుంటూ
బాపూజీ కలలు కన్నట్టు స్త్రీ అర్ధరాత్రి వంటరిగా నిర్భయంగా తన పనులు చేసుకోగలిగే రోజున నిజమైన స్త్రీ దినోత్సవం జరుపుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలను గౌరవించాలి, వారి మనసును నొప్పించవద్దు అని సమాజాన్ని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected