
విశిష్ట పురస్కారం అందుకున్న అనంచిన్ని
★ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా
★ రూ.50 వేల నగదు పురస్కారం అందించిన సిబిఐ మాజీ డైరెక్టర్ జే.డీ లక్ష్మీనారాయణ
★ అంగరంగవైభవంగా అవార్డుల వేడుక
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో ఉత్తమ జర్నలిస్టుల ఉగాది పురస్కారాల కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.
ఈ వేడుకలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.
రూ.50 వేల నగదు పురస్కారాన్ని సిబిఐ మాజీ డైరెక్టర్ జే.డీ లక్ష్మీనారాయణ అందించారు.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు మేడవరపు రంగనాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు
జర్నలిస్టులు ప్రస్తుత ఎన్నో కష్టమైనా పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ వృత్తిలో నిలబడుతున్నారని జర్నలిస్టులు అంటే దేశానికి వెన్నుముక్క లాంటివారని వారిని ప్రశంసించారు.
ఈ రీతిగా ఈ తెలుగు జర్నలిస్టుల సంఘాన్ని ఏర్పాటు చేసిన రంగనాయకులును ప్రశంసించారు. ఈ సంఘం ద్వారా జర్నలిస్టుకి ఎన్నో మెరుగైన లబ్దులు ఉన్నాయని తెలియజేశారు.
జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని సమాజాన్ని బాగుచేయాలని తెలియజేసారు ఈ రోజులో ఏదో ఒక పార్టీకి న్యాయం చేసేవారు కాక సమాజానికి న్యాయం చేసేవారుగా నిజాయితీగా సమాజని మెరుగుపరుచుకునేందుకు జర్నలిజం ఉపయోగపడాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రెండు రాష్ట్రాల నుంచి భారీగా జర్నలిస్టులు తరలిరావడం జరిగింది. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.