
మానవత్వం చాటుకున్న పొంగులేటి
బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నయువతికి రూ. లక్ష ఆర్థిక సాయం
ఖమ్మం: ఆపద్బాంధవుడు…. జనహృదయనేత… ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఖమ్మం నగరంలోని గోపాలపురానికి చెందిన యువతి చావ మౌనిక చౌదరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం రాత్రి ఆ యువతికి కుటుంబ సభ్యుల సమక్షంలో అందించారు. వెంటనే మెరుగైన చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయించాలని పొంగులేటి తన కార్యాలయ సిబ్బందిని, అనుచరులను ఆదేశించారు. ప్రాణాపాయ స్థితి నుంచి తనను కాపాడే ప్రయత్నం చేస్తూ ఆర్థిక సాయం అందజేసిన పొంగులేటి శీనన్న కు తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా చావా మౌనిక చౌదరి పేర్కొన్నారు.