
మా ఇల్లు మాకిప్పించండి మహాప్రభు
అధికారులు వేడుకుంటున్న భీమ్లా తండా గిరిజనులు
సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు హత్తి రామ్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని భీమ్లా తండా లో గత మూడు సంవత్సరాల క్రితం 51 డబల్ బెడ్ రూమ్లను నిర్మించగా అవి పూర్తి అయినాయి ఆ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను లాటరీ పద్ధతిలో జూలూరుపాడు మండల తాసిల్దార్ లాటరీ నిర్వహించగా వారి పేర్లు లాటరీ పద్ధతిలో వచ్చినాయి అందుకు సంబంధించి లాటరీ పద్ధతిలో రానివారు అనర్హులుగా ప్రకటించినప్పటికి కొంతమంది రాజకీయ అండదండలతో డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు
లాటరీ పద్ధతిలో వచ్చిన వార అంతా మాకు వచ్చిన ఇండ్లను మాకు ఇప్పించండి ప్రభువు అంటూ సంబంధిత తాసిల్దార్ కలెక్టర్ కి విన్నవించుకున్న ఫలితం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని భీమ్లా తండా గ్రామం నందు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు టెన్ డేసి నిరసన తెలియజేసినారు మా ఇల్లు మాకిప్పిచ్చేంత వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదని కొంతమంది గిరిజన మహిళలు వాపోయారు
పేదలైన మేము మాకు వచ్చిన ఇండ్లను భూమి ఇల్లు ఉన్నవారు ఆక్రమించుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ వాపోయారు ఇకనైనా సంబంధిత అధికారులు మా గోడు విన్నవించుకుని మాకు లాటరీ పద్ధతులు వచ్చిన ఇండ్లను మాకు కేటాయించాలని అధికారులు వేడుకుంటున్నారు .