Telangana

మా నాయుకుడు జోలికి వస్తే ఊరుకునేది లేదు. BSSM.

మా నాయుకుడు జోలికి వస్తే ఊరుకునేది లేదు. BSSM.

భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారికి మా నాయకుడు అయినటువంటి BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు పై కొంతమంది రాజకీయ నాయకులు కావాలని సత్తుపల్లి కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత కక్షతో అధికారులను బెదిరిస్తూ వాళ్లతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని పెనుబల్లిలో రెండు కేసులు సత్తుపల్లిలో ఒక కేసు పెట్టించడం జరిగిందని ఇలాంటివి మానుకోకపోతే 1,50,000 మంది కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ సర్వ సమాజ్ మహసంఘ్ కార్యకర్తలు నాలుగు జిల్లాల్లో 650 గ్రామాల్లో బలమైన క్యాడర్ గా ఉన్నటువంటి మేము చూస్తూ ఊరుకునేది లేదని జిల్లా కలెక్టర్ కి జిల్లా ఎస్పీ గారికి 40 మంది టీం వెళ్లి స్వయంగా కలిసి మెమోరాన్ని అందజేయడం జరిగింది.

స్పందించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ కి లేఖ రాస్తానని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కూడా ఇచ్చినటువంటి పిటిషన్ పై పూర్తి విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కి జిల్లా కలెక్టర్ కి భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ….

గతంలో కూడా దాడి చేయాలని ప్రయత్నించిన వారిపై మరియు అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్న వారిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ డీజీపీ కి, రాష్ట్ర గవర్నర్ కి, జాతీయ ఎస్టీ కమిషన్ కి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ మా నాయకుడు మద్దిశెట్టి సామెలపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నామని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో ……
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఈసం రవి, టేకులపల్లి మండల అధ్యక్షులు సూరే సీతారాములు, ఇల్లందు మండల అధ్యక్షుడు కిన్నెర రామకృష్ణ, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు కొమరం హరే రామ కృష్ణ, గార్ల బయ్యారం మండల అధ్యక్షులు సూర్ణపాక రామ్ దొర, పాల్వంచ మండలానికి చెందినటువంటి వజ్జ సీత జిల్లా నాయకులు రమేష్ నాయక్ రాష్ట్ర మహిళా నాయకులు సుష్మ, రచ్చ సుజాత, వర్శ మంగ, ఈసం నరసమ్మ, ధరావతు లక్ష్మి, లాకవత్ లలిత, మూడు పార్వతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈసం నాగలక్ష్మి, చంద్రుగొండ మండలానికి చెందినటువంటి కిన్నెర శేషు, అనేకమంది కలిసిన వారిలో ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected