
మా భూమి కబ్జా చేసి మాపైనే కేసు పెడుతున్నారు : సరోజ
న్యాయం కోసం ఎక్కడి వరకైనా పోరాడతా
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 05,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రెవిన్యూ గ్రామ పరిధి (ప్రస్తుత రామంజనేయ కాలనీ) లోని సర్వే నంబర్ 137/1 ప్లాట్ నంబర్ 37 లో మా తాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు సిహెచ్ జాన్ కు చెందిన 5 సెంట్ల భూమిని శ్రీనివాస్ అనే వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తు గోడకట్టి రూమ్ నిర్మించారని ఇదేం న్యాయం అని అడిగేందుకు వెళ్లిన తనను ఇబ్బంది పెట్టారని సరోజ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాను తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోని వెళ్లి స్థానిక రామంజనేయ కాలనీ సర్పంచ్ కు చూపించామని తమ ఇరువురి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపుతానన్న సర్పంచ్ మాటను కాదని తనపై తన తరపున మాట్లాడటానికి వచ్చిన కబీర్ దాస్, రంగా తుమ్మల శ్రీను లపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆమె వాపోయారు. తనకు ఎవరు అండగా లేరన్న విషయం తెలుసుకుని వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేసే క్రమంలో ఇలా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఆ స్థలం శ్రీనివాస్ దే అయితే ఆ స్థలం ఎవరి దగ్గర కొన్నారు? దానికి సంబందించిన లింక్ డాక్యుమెంట్లను చూపించాలని ఆమె అన్నారు. ఒంటరి మహిళ అయిన తనకు ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలన్నారు.