
మిత్రుడికి అంతిమ వీడ్కోలు పలికిన మంత్రి పువ్వాడ..
పాడి మోసి పాత జ్ఞాపకాలను తలచుకుని కంతంటడి పెట్టుకున్న మంత్రి..
సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం
తన బాల్య ప్రియ మిత్రుడైన కొల్లి శ్రీధర్ గారి అకాల మరణం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలచివేసిందని తంటతడి పెట్టుకున్నారు.
శ్రీనగర్ కాలనీ నందు తన నివాసం వద్ద ఉంచిన పార్థివ దేహాన్ని మంత్రి సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
అనంతరం అన్ని తానై దగ్గరైంది అంతిమ వీడుకోలు ఏర్పాట్లను దెగ్గరుండి పాలుపంచుకున్నారు. ఇంటి ప్రాంగణం మొత్తం విషాదచాయలు అలుముకున్నాయి.
దివంగత శ్రీధర్ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు. సుదీర్ఘకాలంగా మమత వైద్య సంస్థల్లో వారు అందించిన సేవలను, వారితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తన ప్రియ మిత్రుడు ఇక లేదు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని, మొహంలో చెరగని చిరునవ్వుతో చిందిస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడని..తాను ఇక మా మధ్య లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
శ్రీధర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా అంతిమ వీడ్కోలులో పాల్గొని పాడేని మోశారు. జోహార్ శ్రీధర్ అంటూ నినాదాలు చేసూ ముందుకు కదిలారు. అనంతరం కల్వొడ్డు వైకుంఠధామం నందు అంత్యక్రియల్లో స్వయంగా పాల్గోన్నారు.