
సూర్యాపేట టౌన్
మిల్లర్ల నుంచి మంత్రి ముడుపులు తీసుకున్నాడు కాబట్టే ….ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు
సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు వచ్చేంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదు
రైతులకు అండగా ఉండాల్సిన మంత్రినే మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తున్నారు..
ఐకెపి కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో మిల్లర్లకు MSP కంటే తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
ఒక్క రైతు బంధు పథకం పేరు చెప్పుకుంటూ రైతులను నిలువునా దోపిడీ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలు వచ్చేంతవరకు కూడా ధాన్యం కొనుగోలు జరపడం లేదు…
గతంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండానే ట్రక్ షీట్లు కొనుగోలు పత్రాలు సృష్టించి బిఆర్ఎస్ నాయకులు అక్రమ దందాకు పాల్పడ్డారు
సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లలో 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది.. దీనికి పాత్రధారి, సూత్రధారి మంత్రి జగదీశ్వర్ రెడ్డి
రైతులను మిల్లర్లు దోచుకుంటే కాపాడాల్సిన పాలకులే దోపిడీదారులకు అండగా ఉన్నారు
ధాన్యం ఎఫ్సిఐ కి పెట్టని మిల్లులను అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా , రీ అలాట్మెంట్ చేస్తున్నారంటే పాలకులకు, మిల్లర్లకు మధ్య ఏ స్థాయిలో ఒప్పందం జరిగిందో అర్థం చేసుకోవచ్చు..
మొలకలు వచ్చిన , రంగు మారిన ధాన్యాన్ని కూడా ఎమ్మెస్పీ ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను నష్టపోకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు 20000, మామిడి తోట ద్వారా నష్టపోయిన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సలిగంటి వీరేంద్ర, మల్లెపాక సాయిబాబా, పార్లమెంట్ కో కన్వీనర్ తుక్కని మన్మధ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి పలస మల్సూర్ గౌడ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్దాసు ఉపేందర్, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీరు అక్బర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు అరూరి శివ, తోనూకునూరి సంతోష్ కుమార్ , జిల్లా నాయకులు జల్లి గణేష్ , దాసరి వెంకన్న యాదవ్, కొప్పుల క్రాంతి రెడ్డి ,యువ మోర్చా మండల నాయకులు బీమగాని గణేష్ తదితరులు పాల్గొన్నారు..