KothagudemPoliticsTelangana

మీది పోడు యాత్ర కాదు, పాడు యాత్ర

మీది పోడు యాత్ర కాదు, పాడు యాత్ర

మీది పోడు యాత్ర కాదు, పాడు యాత్ర

ద్వజమెత్తిన అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్

అశ్వాపురం సి కె న్యూస్ మే 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశం లో బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది వారి స్వార్థ రాజకీయాల కోసం,స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజనులను అడ్డం పెట్టుకొని మీటింగులు,యాత్రలు చేస్తున్నారన్నారు,

వీళ్ళు అధికారం అనుభవించినప్పుడు ఏ ఒక్క గిరిజన గ్రామాలకు న్యాయం చెయ్యలేదని,ఎవ్వరినీ పట్టించుకోలేదని,కానీ ఈరోజు మాత్రం వారి రాజకీయ భవిష్యత్తు కోసం వలకమాలిన ప్రేమ ఒలక పోస్తున్నారని అన్నారు,

ఈ నాడు రాష్ట్రం లో గిరిజనులు వెనుకబాటు తనం నుండి అభివృద్ధి బాట లో దూసుకెళ్లాలని కోరుకుంటూ వారికి అనేక పథకాలను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఒక్క కెసిఆర్ ప్రభుత్వమే అన్నారు,

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం పోడు సర్వే చేపించి వారికి పట్టాలు అందచేసె తేదీలను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే అన్నారు,

కెసిఆర్ వారికి రైతు బంధు,రైతు బీమా వంటి పథకాలను కూడా వర్తింపజేయాలని అధికారులను ఆదేశించటం కూడా జరిగిందన్నారు,ఈ రోజు మీ యాత్రల ద్వారా మీరు సాధించేది ఏమీ లేదన్నారు, గిరిజన ప్రజల ఆశాదీపం రేగా కాంతారావు అని రేగా కాంతారావు ఆదేశాలతో నిన్న కూడా గత ఐదు సంవత్సరాలు గా తుమ్మల చెరువు,వెంకటాపురం గ్రామాల మధ్య దాదాపు 1000 ఏకరాల భూమిని రెవిన్యూ ,ఫారెస్ట్ అధికారులతో ఎంజాయ్ మెంట్ సర్వే చేపించి ప్రభుత్వ భూమిగ నిర్ధారించి వారికి త్వరలోనే అసైన్ మెంట్ పట్టాలు ఇప్పించి ప్రభుత్వ పథకాలు రైతు బంధు కూడా వర్తింప చేయటానికి కృషి చేశారన్నారు.

గిరిజన గ్రామాలు ఏర్పడ్డ దగ్గరనుండి వర్షాకాలం వస్తె కొన్ని గ్రామాలకు వాగులు పొంగి ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది అయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆ గ్రామాల ప్రజల దశాబ్దాల కాలంగా తీరని కోరిక గా వున్నటువంటి గొందిగూడెం ఇసుకవాగు పైన,తుమ్మల చెరువు లోతువాగు పైన కోట్ల రూపాయల నిధులతో బ్రిడ్జి లు మంజూరు చేపించి వారి ఇబ్బందులు తీర్చిన ఘనత బి అర్ యస్ ప్రభుత్వానిది,

స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు దే అని అన్నారు.అధికారం లో వున్నప్పుడు ఆ గ్రామాలకు ఏమి చెయ్యలేక ,ఇప్పుడు ఏదో చేస్తున్నాం,మీ గురించి పోరాడుతున్నo అంటు అమాయక గిరిజన ప్రజలను మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం సరి కాదన్నారు,తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మీ చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు,

మీరిలాంటి యాత్రలు వంద చేసినా ప్రజలు మీ యాత్రలను విశ్వసించరని,ప్రజలకు అభివృద్ధి ఎవరు చేస్తున్నారో తెలుసని రాబోయే ఎన్నికల్లో నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన ప్రజానాయకుడు రేగా కాంతారావు గెలుపు బి అర్ యస్ పార్టీ కెసిఆర్ ఆధ్వర్యంలో మూడవ సారి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు,

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల రైతు సమితి సమన్వయ అధ్యక్షులు గజ్జల లక్ష్మారెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,సూదిరెడ్డి గోపిరెడ్డి,మండల ఎస్సీ సెల్ మరియు బీసీ సెల్ అధ్యక్షులు కోర్స దుర్గారావు,మామిళ్ళ కనీష్,జగ్గారం సర్పంచ్ సున్నం రాంబాబు,గొల్లగూడెం ఎంపీటీసీ ఎనిక రవి, కంసాని సత్యనారాయణ,ఏడ్ల బలరాం,చల్లా రాజేష్,తదితర నాయకులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected