
మున్నేరు పై తెగల వంతెనకు EPC టెండర్ కొరకు GO జారీ.
▪️కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.
▪️ఖమ్మం ప్రజల తరుపున సిఎం కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ.
హైదరాబాద్ తరువాత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర సిగలో మరో మణిహారం అయిన మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం GO ను విడుదల చేసింది.
ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో నిర్మించనున్న తీగల వంతెన కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం EPC టెండర్ ను ఖరారు చేస్తూ జీఓ నెం.90 ను జారీ చేసింది.
ఇందుకు గాను ఆయా టెండర్ ను అప్రూవ్ చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కన్వీనర్ గా పి రవీందర్ రెడ్డి EnC (R&B), కో కన్వీనర్ గా గణపతి రెడ్డి ENC (R&B), సభ్యులు గా P సతీష్ CE (R&B), P మధుసుధన్ రెడ్డి CE (R&B), లను నియమించింది.
మొత్తం 420 మీటర్ల పొడవైన ఈ బిడ్జి నిర్మాణంలో 300మీటర్ల తీగల వంతెన ఉంటుందని, హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెన నమూనాలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరగబోతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.
హైదరాబాద్ దుర్గంచెరువుపై నిర్మించిన హైలెవల్ తీగల వంతెన తరహాలో ఖమ్మం మున్నేటిపైనా కొత్త వంతెన నిర్మాణ పనులు టెండర్ ప్రక్రియ పూర్తి అవగానే ఆయా పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.
నిర్మాణ పనులకు గాను ఆయా టెండర్ కొరకు GO ను జారీ చేయడం పట్ల ఖమ్మం ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.