
రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు:- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది :- మంత్రి అజయ్ కుమార్
సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం
తెలుగు నూతన సంవత్సరాది శోభకృత నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ నూతన తెలుగు సవంత్సరంలో తెలంగాణ ప్రభుత్వ కృషి,దైవకృపతో బ్రహ్మడంగా పంటలు పండుతాయని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు.రైతు సంక్షేమ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. గడచిన ఎనిమిదేళ్ళలో మనం దుర్బిక్షాన్ని ఎరుగమని, పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండినాయని అన్నారు. పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం కొనలేని స్థాయికి నేడు రైతాంగం ఎదిగింది అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు.
ఈ శోభకృత నామ సంవత్సరంలో మరింత సంక్షేమం, అభివృద్ది సాధిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో ఖమ్మం జిల్లా మరింత ప్రగతి సాదించనుందని అని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా పంటలను సస్యశ్యామలం చేసి, సీతమ్మ సాగర్ కు సంబందించిన అనకట్టకి వడి వడిగా అడుగులు పడుతున్నాయని, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను పారించుకునే అధ్భుత అవకాశం లభిస్తుందన్నారు.
ఖమ్మం నలువైపులా అభివృద్ధి జరుగుతుందని, రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంకు 3వేల మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున ప్రభుత్వం ద్వారా సొంత జాగాలో ఇళ్ళు కట్టుకోడానికి నిధులు అందిస్తామన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో మొత్తం 30వేల మందికి లబ్ధి జరుగుతాదని అన్నారు.
అనతికాలంలోనే అన్ని రంగాలను పటిష్టపరుచుకున్నామని, శోభకృత నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాదించనున్నది అని మంత్రి పువ్వాడ అన్నారు.అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారింది అని తెలిపారు.