రిబ్బన్ కటింగ్ లకే పరిమితమైన కొనుగులు కేంద్రాలు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ శాసనసభ్యులు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని చెప్పి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి రైతులను మండుటెండలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు పాలేరు ఐకెపి కేంద్రంలో శాసనసభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి వారం రోజుల క్రితం హంగు ఆర్భాటాలతో కొబ్బరికాయలు కొట్టి ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించారని కానీ మిల్లర్స్ అలాట్మెంట్ లేని కారణంగా ఒక్క లోడు కూడా ఐకెపి కేంద్రం నుండి బయటికి రాలేదని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి కురిసిన అకాల వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయని జిల్లావ్యాప్తంగా శాసనసభ్యులు మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలలో కాంటాలు వేయకుండా రైతులను మోసం చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు పాలేరు ఐకెపి కేంద్రాన్ని బిజెపి కిసాన్ మోర్చా నాయకులతో కలిసి సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు కొనుగోళ్ల విషయంలో తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఐకెపి కేంద్రంలో వడ్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న తహసిల్దార్ మరియు ఏపీవోలతో శ్రీధర్ రెడ్డి రైతుల పక్షాన వాగ్వాదానికి దిగారు వెంటనే మిల్లులను అలాట్మెంట్ చేసి కొనుగోలు ప్రారంభం చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శి హటియా నాయక్ బిజెపి మండల అధ్యక్షుడు బజ్జురి మల్లారెడ్డి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వెంకటేశ్వర్లు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రాసాల రవి దామల్ల ప్రభాకర్ బిజెపి సీనియర్ నాయకులు దాసరి వెంకటేశ్వర్లు కోడి వెంకన్న శంకర్ నాయక్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు