
నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విద్య శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు
TS Inter Results | హైదరాబాద్ : నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్లను లాగిన్ అవొచ్చు.