PoliticsTelangana

రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి భారీ ప్రమాదం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ధ్వంసమైన కారు

కాగా రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి కార్లు ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇందులో 4 కార్లు కాన్వాయ్ లోని వాహనాలు కాగా మరో రెండు కార్లు రిపోర్టర్స్ కి సంబంధించినవి. ఇందులో సిరిసిల్ల రిపోర్టర్స్ ఉండగా.. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected