
రేవంత్ రెడ్డి డ్రైవర్ పై దాడి చేసిన పోలీసులు..!
రాష్ట్రంలో కొంత మంది పోలీసులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. తమకు అధికారం ఉంది కాదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం దగ్గర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రైవర్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో రేవంత్ రెడ్డి డ్రైవర్‌పై పోలీసులు దాడి చేశారు. రేవంత్ రెడ్డి కారు డోర్ తీసి మరి డ్రైవర్ పై దాడి చేశారు. అతన్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు రేవంత్ రెడ్డి డ్రైవర్ ను కొట్టారు.
కొట్టడమే కాదు బండబూతులు తిట్టారు. తనపై పోలీసులు అకారణంగా పోలీసులు దాడి చేశారని రేవంత్ రెడ్డి డ్రైవర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి డ్రైవర్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో కారు రేవంత్ కారులో లేరు. రేవంత్ రెడ్డి సభా వేదికపైకి వెళ్లిన తర్వాత పోలీసులకు.. డ్రైవర్ కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పై పోలీసులు దాడి చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు మాత్రం ఆగలేదని తెలుస్తోంది.
షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న క్రమంలో కూడా ఎస్సై షర్మిల కారు డ్రైవర్ ను బయటకు లాగి.. బెదిరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు ప్రజలతో వ్యవహరించే తీరు కూడా సరిగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. మొన్న జూబ్లీహిల్స్ లో బాలుడు నీటి కుంటలో పడి చనిపోయిన విషయంలో స్థానిక సీఐ బాధితులను బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. తీన్మార్ మల్లన అరెస్ట్ చేసే క్రమంలో కూడా పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హన్మకొండలో పెళ్లి బారాత్ ఆలస్యం అయ్యిందన్న కారణంగా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాము వెళ్లిపోతామని ఎంత ప్రాధేయపడినా విడిచిపెట్టకుండా ఒక యువకుడిపై ఎస్సై చెయ్యి కూడా చేసుకున్నాడు. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.