రైతుల కష్టాలు ఎలక్షన్ లోపు నెరవేర్చకపోతే రైతుల పక్షాన ఉండి పోరాడుతా: ఎంపీపీ

రైతుల కోసం అవసరమైతే జైలుకైనా వెళ్తా: ఎంపీపీ
కారేపల్లి మండల పరిధిలోని మాణిక్యారం గ్రామపంచాయతీ పరిధిలో 10గ్రామపంచాతీల బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సోమవారం మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మాలోత్ శకుంతల రైతుల పక్షాన తన గళం వినిపించారు చీమలపాడు గ్రామంలో ప్రజలు పొడు భూములను ఆధారంగా చేసుకుని జీవనముకొనసాగిస్తున్నారని. తాతలు సంపా దించిన ఆస్తులు లేక అడవి తల్లిని. పోడు భూములను నమ్ముకొని వర్షంపై ఆధారపడి పంట పండించుకుం టూ జీవనం కొనసాగిస్తున్నారు తెలుపుతూ. గత ప్రభుత్వంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు వచ్చి ఉన్న రైతుల పొలాలలో ఫారెస్ట్ బోర్లు వేసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని. రైతులకు గురి చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్త ణం చేశారు. పంట పండించేందుకు నీటి సౌకర్యం లేక రైతన్నలు కష్టాలు ఎదుర్కొంటున్నారని. రైతుల బాధల ను ఎంపీపీ ఎమ్మెల్యే దృష్టికితీసుకువెళ్లారు. మండలం లోని మరో గ్రామ పంచాయతీల అయినా ఎర్రబోడు గ్రామంలో సుమారు 90 మంది పోడు రైతులకుభూమి సర్వే నిర్వహించలేదని. ఆ పోడు రైతులకు సర్వే నిర్వహించి పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించాలనిఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సాక్షిగా ప్రసంగించారు రైతుల కష్టాలు ఎలక్షన్ లోపు నెరవేర్చకపోతే రైతుల పక్షాన ఉండి పోరాడుతాననిఅవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని సభ ముఖంగా ఎంపీపీ శకుంతల స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉండి రైతుల పక్షాన గళం విప్పడంతో రైతులంతా సంతోషాన్ని వ్యక్తం చేసి ఎంపీపీ శకుంతలకు రైతులు అభినందనలు తెలిపారు.