లౌకిక రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం

లౌకిక రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం…….
సీకే న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి చివ్వేంల…. ఏప్రిల్ 23
SFI
సీబీఎస్సీ పదవ తరగతి పాఠ్యాంశంలోని నుంచి డార్విన్ థియోరీ తొలగించడం అంటే మూఢత్వాన్ని పెంచడమేనని వివరించారు. చివేంల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో బిజెపి వివరిస్తుందని అన్నారు. ఆశాస్త్రీయ భావాలను విద్యార్థుల్లో నిండి ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో విద్యని మూడోత్వంలో నెట్టి కాషాయకరణం పెంచే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు,
జాతీయ ఉద్యమ వీరులు హిందూ ముస్లిం ఐక్యత వంటి పాఠంశాలు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు డార్విన్ సిద్ధాంతం తొలగించడం వల్ల సైన్స్ పాఠంశాలు మళ్లీ పాత పద్ధతిలోనే మూఢనమ్మకాలతో అవిశ్వాసాలతో ఉండే ప్రమాదం ఉందన్నారు. డార్విన్ తీరని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. సైన్స్ చరిత్ర లేకుంటే దేశ భవిష్యత్తు లేదన్నారు. ఆర్ఎస్ఎస్ సైన్స్ చరిత్రలను తొలగించి ఆర్ఎస్ఎస్ భావజాలాలను పాఠ్యపుస్తకాల్లో చూపించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. డార్విన్ థియరీ,మహనీయుల చరిత్రలను, పాఠంశాలలో పునరుద్ధరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.