Telangana

వరంగల్ జైల్‌ను కుదువ పెట్టిన KCR

వరంగల్ జైల్‌ను కుదువ పెట్టిన KCR

వరంగల్ జైల్‌ను కుదువ పెట్టిన KCR.. బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు

సెంట్రల్ జైల్ స్థలాన్ని సైతం వదలకుండా కుదవ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ మాజీ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు.

వరంగల్ సెంట్రల్ జైల్‌ను కూల్చి దాని స్థానంలో 25అంతస్తులతో 1150కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. ప్రజలకు చెప్పకుండానే జైల్ స్థలాన్ని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకు తనఖా పెట్టిన విషయాన్ని తాను సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సైతం ఆయన విలేకరులకు చూపించారు. హన్మకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బక్క జడ్సన్ మాట్లాడారు.

వరంగల్ సెంట్రల్ జైల్ స్థలాన్ని కుదువ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకు అఫ్ మహారాష్ట్రలో కమంగల్, శివాజీనగర్, పూణే బ్రాంచ్ నుంచి 01/09/2022 న రూ.1150 కోట్ల రుణం పొందారని అన్నారు. తెలంగాణ సూపర్ స్పెషలిటి హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డా. రమేష్ రెడ్డి S/o. ధర్మారెడ్డి పేరు మీద మార్టిగేజ్ చేసి ఈ రుణం తీసుకున్నట్లు తెలిపారు. 2014లో ముఖ్యమంత్రి కాగానే ఉస్మానియా, గాంధీ దావఖానాలకు రూ. వంద కోట్ల చొప్పున కేటాయిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వరంగల్ ఎంజీఎంలో నేటికి వసతులు కల్పించడం లేదని అన్నారు. పేషెంట్లను ఎలుకలకు అప్పజెప్పిన కేసీఆర్‌, ఇప్పుడు జైలు స్థలాన్ని తనఖా పెట్టి కమీషన్ల కోసమే సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నాడని ఆరోపించారు. ఆస్పత్రి నిర్మాణం పేర డబ్బు నొక్కడానికే, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రజా సంపదను దోచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ తంతగం చేస్తున్నారని అన్నారు.

ఆర్‌బీఐకి లేఖ రాశా.. ఇప్పుడు ఫిర్యాదు చేస్తా..

గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చట్టబద్ధమైన మరియు ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రత్యేక ఆడిట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకు అధికారులు మరియు ఆర్థిక సంస్థల అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ముంబైలోని ఆర్ బీఐ గవర్నర్‌కు లేఖ రాయడం జరిగిందని అన్నారు. తాజాగా సెంట్రల్ జైల్ స్థలంపై రుణం పొందిన విషయాన్ని తాను ఎంతో కష్టపడి సాక్ష్యాధారాలతో వెలుగులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. తాను సాక్ష్యధారాలతో చేస్తున్న ఆరోపణలపై దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌ గాని స్పందించాలని సవాల్ విసిరారు.

గతంలో తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్. CIN U51900TG2015SGC098100 రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ ద్వారా కాలానుగుణ అవసరాల ప్రకారం రూ.45000 కోట్ల రుణాన్ని పొందిందని అన్నారు. అయితే ఆ హామీలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వాల్యూమ్ 5/Bలో నమోదు చేయబడలేదని (ఇది తాత్కాలిక రిస్క్ వెయిటేజీతో రాష్ట్ర ప్రభుత్వ హామీల జాబితా కోసం బడ్జెట్లో ప్రత్యేక వాల్యూమ్) తెలిపారు.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. CIN U73100 TG2016SGC111329 ఒక నీటిపారుదల ప్రాజెక్ట్, ఇది తిరిగి చెల్లించే సామర్థ్యం లేదని మరియు తెలంగాణ రాష్ట్ర హామీ ద్వారా కాలానుగుణంగా వివిధ బ్యాంకులు మరియు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుండి 97,449.16 కోట్ల రుణాన్ని పొందిందని సమర్పించబడిందన్నారు.

ప్రభుత్వం మరియు లోన్ మొత్తానికి తక్కువగా ఉన్న చరాస్తులు మరియు ప్రత్యక్ష ఆస్తులను ఊహించడం ద్వారా, REC Ltd ఈ ప్రాజెక్ట్ ఆమోదం పొందని భాగానికి రూ.30536,08,00,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం 13000 వేల కోట్ల ఎవ్రీ మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected