వరి ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం జాప్యం

వరి ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం జాప్యం
ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, వరంగల్ తో పాటు పలు జిల్లాల్లో పంట కల్లాలలో ఉంది.
కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ముందస్తు ఆలోచననే ప్రభుత్వం వద్ద లేదు.
ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రబీలో పంటల సాగు ముందుకు జరుపుకోవాలి అని, ఇలా పలు జిల్లాల్లో సాగు చేస్తున్నారని చెప్పిన మంత్రిగారికి ముందస్తు వరి పంట కటింగ్ ముందే వస్తది అనే విషయం తెలియదా?.
కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం వలన 1700 వందలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చింది.
ఒక దిక్కు వాతావరణ పరిస్తితి లు కూడా రైతులకు సహకరించడం లేదు.
కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రం అంత ఒకే సారి కాకుండా ఎక్కడ అయితే పంట చేతికి వచ్చిందో అక్కడ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
కల్లలలో ఉన్న ధాన్యం వర్షానికి తడవకుండా కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి.
తరుగు పేరుమీద రైతుల ను దోచుకోవడాన్ని నిలువరించాలి.
తూకం వేయగానే రైతులకు తూకం పట్టి కొనుగోలు కేంద్రం వద్ద ఇవ్వాలి.
అన్వేష్ రెడ్డి సుంకేట, చైర్మన్
తెలంగాణ కిసాన్ కాంగ్రేస్